భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ , పట్టభద్రుల MLC జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా భవన్లో మరియు తహసిల్ చౌరస్తా వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సహం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

రాయికల్ మం. సింగరావుపెట, వీరాపుర్ గ్రామాల్లో అంబేద్కర్ 131 వ జయంతినీ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ., ఈ కార్యక్రమంలో రాయికల్ మండల ప్రజా ప్రతినిదులు, గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

పట్టణ బుడగజంగల కాలనిలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి జగిత్యాల్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ వనరాసి మల్లవ్వ తిరుమలయ్యా, అంబెడ్కర్ సంఘ అధ్యక్షుడు లక్ష్మణ్, సంఘ నాయకులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ శాఖ పక్షాన..
భావి తరాలకు అంబేద్కర్ జీవితం ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రూపేష్ ఐపీఎస్ అన్నారు.
డా”అంబేద్కర్ గారి ఆశయాల సాధన దిశగా అందరూ నడుచుకోవాలని,ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు..ఈ కార్యక్రమంలో రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ నవీన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అణగారిన వర్గాల ఆశా దీపం !
జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాల వేసి జెడ్పి చైర్ పర్సన్ వసంత ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జెడ్పీటీసీ సంగెం మహేష్, కథలపూర్ జెడ్పీటీసీ నాగం భూమయ్య, కో ఆప్షన్ షేక్ అంజడ్ జెడ్పీ సీఈఓ రామానుజాచార్య(FAC) మరియు జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో..
.జగిత్యాల జిల్లా కేంద్రంలో బాబా సాహెబ్ BR Ambedkar 131 వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పక్షాన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మహంకాళి రాజన్న దేశం పార్టీ శ్రేణులు, పూలమాల లు వేసి ఘనంగావేసి నివాళులు . అర్పించారు.

బిజెపి ఆధ్వర్యంలో
హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో,ట్యాంక్ బండ్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లో డా. బిఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎంపీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి నివాళులు అర్పించారు.

ధర్మపురిలో..
ఈరోజు భారతీయ జనతా దళిత మోర్చా ఆధ్వర్యంలో 131 Dr Br అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ధర్మపురిలో గాంధీ చౌక్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా అధ్యక్షుడు కడారి గంగాధర్,జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్,జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్,జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు బండారు లక్ష్మణ్,బీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు నెరేళ్ల రాములు,BJYM పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్,సంగి మాధవ్,దివిత్తి శ్రీధర్,ఆనందస్ నవీన్,బుర్ర రాము గౌడ్,సీనియర్ నాయకులు సంగి నర్సయ్య,నలుమసు వైకుంఠం,చుంచుకలా కిషన్,బొమ్మకంటి శ్రీనివాస్,పల్లర్ల సురేందర్,కటకం శంకర్,స్తంభాకండి శ్యామ్,అబతిపెళ్ళి నర్సయ్య,రాజన్న తదితరులు పాల్గొన్నారు.
