డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలి-మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రపంచ మేధావులు ఒకరైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం. ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో పర్యటన లో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం మిని ట్యాంక్ బండ్ పై ఉన్న డా.బీఆర్‌ అంబేద్కర్‌ గారి విగ్రహానికి పూలమాలలు వేశారు.

నిర్మల్ పట్టణంలో లో అధునాతన వసతులతో నిర్మించిన నూతన అంబేద్కర్‌ భవన్ ను, సహచర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తో కలిసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ భవనాన్ని ఎక‌రం విస్తీర్ణంలో రూ. 5 కోట్ల వ్యయంతో విశాల‌మైన నిర్మించారు. సుమారు 2 వేల‌ మంది కూర్చునేలా ఆడిటోరియాన్ని, ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.


ప్రభుత్వ లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలి


మన ఊరు మన బడి, దళిత బంధు పథకం, మొక్కల సంరక్షణ, 10వ తరగతి పరీక్షలు, కరోనా వ్యాక్సినేషన్ మొదలైన ప్రభుత్వ కార్యక్రమాల పై కలెక్టర్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.


జిల్లాలో 346 దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, 180 మంది లబ్ధిదారుల డాక్యుమెంటేషన్ పూర్తిచేసి యూనిట్లను మంజూరు చేశామని, 52 యూనిట్ల డాక్యుమెంటేషన్ పూర్తవుతుందని, మొత్తం 232 యూనిట్లను త్వరితగతిన గ్రౌండ్ చేసే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. మిగిలిన దళిత బంధువు యూనిట్ల డాక్యుమెంటేషన్ పూర్తిచేసి త్వరితగతిన గ్రౌండ్ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
దళిత బంధు పథకం అమలుపై విస్తృతంగా మంగళవారం సమావేశం నిర్వహించడం జరుగుతుందని దానికి పూర్తి సమాచారంతో హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో 90 యూనిట్లకు సంబంధించి నిధులు విడుదల చేశామని , మండలాల్లో ఎంపీడీవోలు మండల ప్రత్యేక అధికారులు వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని దాని ప్రకారం బ్యాంకులు నిధులు రిలీజ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంపికైన 274 పాఠశాలల్లో చేపట్టాల్సిన మనలో ఇప్పటికీ 22 పాఠశాలల్లో లో ప్రతి పాదంలో తయారీ పెండింగ్ లో ఉందని కలెక్టర్ తెలిపారు.
మన ఊరు మన బడి పెండింగ్ ప్రతిపాదనలు పూర్తిచేసి అధికారులు గ్రౌండింగ్ పై శ్రద్ధ వహించాలని, మండలాల వారీగా పనుల గ్రౌండింగ్ కోసం చేపడుతున్న చర్యల పై మంగళవారం ఉదయం సమీక్ష నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు.
ప్రతి విద్యార్థి ప్రత్యేక తరగతులకు హాజరై 100% ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
పెండింగ్ వ్యాక్సినేషన్ త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీలో 100% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ టాక్స్ వసూలు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మున్సిపాలిటీలలో, గ్రామాల్లో అనుమతి లేకుండా ఉన్న పోస్టర్లను , హోర్డింగ్ బోర్డులను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు‌‌.
ప్రజావాణి దరఖాస్తుల్లో తరచూ వచ్చే దరఖాస్తులు అధికమవుతున్నాయని, ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
మండల , డివిజన్, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ యంత్రాల ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ సిబ్బంది ఉదయం సకాలంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు.
అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, ఆర్ డి.ఓలు, జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకోవాలి!
అదనపు ఎస్పీ రూపేష్ ,


జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఆదేశాలమేరకు స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో, సోమవారం జిల్లా అదనపు ఎస్పీ రూపేష్ , డీఎస్పీ లు, సి.ఐలు ,ఎస్ .ఐ ల తో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జ అదనపు ఎస్పీ రూపేష్ సూచించారు.. పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి డీఎస్పీ లను సి.ఐ లను, ఎస్.ఐలను అడిగి తెలుసుకునారు .

దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులలో త్వరగా పరిశోధన పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలి అని పెండింగ్ కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని సూచించారు. డిజిపి గారి ఆన్లైన్ క్రైమ్ రివ్యూ ప్రకారం UI కేసుల టార్గెట్స్ రిచ్ కావాలని సూచించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండేటట్లు చేయాలని అప్పుడే నిందితులకు శిక్షలు పడతాయన్నారు. పెండింగ్లో ఉన్న సీసీ నెంబర్ల గురించి తరచుగా మెజిస్ట్రేట్ లను మరియు కోర్టు అధికారులను కలిసి, ప్రతిరోజూ మానిటర్ చేసి, సీసీ నెంబరులు తీసుకోవాలని సూచించారు. సిసిటియన్ యస్ ప్రాజెక్టు ద్వారా ప్రతి దరఖాస్తులను మరియు యఫ్.ఐ.అర్ లను, సిడిఎఫ్, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సిడి, ఛార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్ లైన్ లో ప్రతి రోజు ఎంటర్ చేయలని ఆదేశించారు. ప్రతిరోజు సీఐలు లు , డీఎస్పీ లు మానిటర్ చేయాలని సూచించారు. సీసీ కెమెరాలను ప్రతిరోజూ మానిటర్ చేయాలని పని చెయ్యని సీసీ కెమెరాలను వెంటనే బాగు చేయించాలని సూచించారు. రిసెప్షన్, క్రైమ్ వర్టికల్, టెక్ టీమ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, తదితర వర్టికల్, విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి తరచుగా శిక్షణ తరగతులు నిర్వహించి వారి యొక్క పనితనాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.


సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలి:
సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగిపోయిందని చెప్పారు. సైబర్ నేరాలకు చెక్ పెట్టడం, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం లక్ష్యంగా పని చేయాలన్నారు. సైబర్ నేరాల కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి నేరస్ధులను గుర్తించటం, వారికి శిక్ష పడేలా చేయడం తద్వారా బాధితులకు న్యాయం చేయడాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొవాలని సూచించారు.
ఈ సమావేశంలో డీఎస్పీ లు ప్రకాష్, రవీందర్ రెడ్డి, DCRB డీఎస్పీ రాఘవేంద్రరావు,SB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, DCRB ఇన్స్పెక్టర్ దుర్గ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్, సి.ఐ లు రాజశేఖర్ రాజు, కిషోర్, రమణమూర్తి, కోటేశ్వర్, శ్రీను మరియు ఎస్. ఐ లు, ఐటీ కోర్, DCRB సిబ్బంది పాల్గోన్నారు.