J.Surender Kumar
దుబాయి దేశములో ఉద్యోగాల కల్పనకు 9-04-2022 న ఇంటర్వ్యూలు జగిత్యాల పట్టణంలో జరగనున్నాయని జగిత్యాల జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిని బి సత్యమ్మ ప్రకటనలో తెలిపారు
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపనీ హైదరాబాద్ (తెలంగాణా ప్రభుత్వరంగ సంస్థ TOMCOM) వారు దుబాయ్ దేశములోని ప్రముఖ సంస్థ కొరకు ఉద్యోగాలను భర్తీ చేయుటకు టామ్ కామ్ జనరల్ మేనేజర్ శ్రీమతి కె. నాగభారతి గారి ఆద్వర్యములో రేపే అనగా 09.04.2022 శని వారము నాడు ఇంటర్వ్యూలు నిర్వహించబడును ఆమె ప్రకటనలో వివరించారు..

ఇంతకు ముందు 29.04.2022 ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పొరపాటున ప్రకటన జారీ చేయడం జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు.అభ్యర్థులు. సవరింపు ను గమనించగలరని విజ్ఞప్తి చేశారు.. తేది 09 .04 .2022 శని వారము ఉదయం అం అం అం 10:30 గంIIలకు జగిత్యాల లోని రిజిస్ట్రేషన్ ఆఫీసు దగ్గర గల ఐ ఎమ్ ఎ హాల్ (IMA Hall ప్రజావాణి జరుగు ప్రదేశము),లో జరుగు ఇంటర్వ్యూలకు హాజరు కాగలరని జిల్లా ఎంప్లాయిమెంట్ అదికారి శ్రీమతి బి. సత్యమ్మ జారీచేసిన ప్రకటనలో పేర్కొన్నారు.