షుగర్ ఫ్యాక్టరీ తెరిచే వరకు నల్లబ్యాడ్జీ పెట్టుకుంటా – కృష్ణారావు !

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిచే వరకు తాను నల్ల బ్యాడ్జి ధరిస్తానని కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. సోమవారం మల్లాపూర్ మండoలోని ముత్యంపెట్ షుగర్ ఫ్యాక్టరీ ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణ రావు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ముత్యంపెట్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అంటూ హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత ఈ రోజు వరకు కనిపించకుండా పోయింది అని అన్నారు. మీకు ఓట్లు వేస్తే ముత్యంపెట్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి మా ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిపిస్తారని నమ్మి ప్రజలుఓట్లు వేస్తే ఉన్న ఉద్యోగాలను తీసివేశారు అని ఆరోపించారు..

మీ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు వచ్చాయని అన్నారు.. ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో అవ్వగానే ఫ్యాక్టరీ ని నా సొంత డబ్బులతో నడిపిస్తా అని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అరవింద్ తన గెలుపు కోసం ముత్యంపెట్ షుగర్ ఫ్యాక్టరీ పేరు వాడుకున్నారు అని ఆరోపించారు. మన ఎమ్మెల్యే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి తో మాట్లాడకుండా కాలయాపన చేస్తున్నారు అని అన్నారు..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముత్యంపెట్ షుగర్ ఫ్యాక్టరీ ని కచ్చితం తెరిపిస్తాం అని, ముఖ్యమంత్రి ఎవరు అయిన జిల్లా పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , మరియు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు , సహకారంతో షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపిస్తాం అని అన్నారు…కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్టరీ ప్రారంభించాం అని.మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినక పునరుద్ధరణ చేస్తాం అని అన్నారు.
షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అయ్యే వరకు నేను నల్ల బ్యాడ్జీ దరిస్తా అని జువ్వాడి కృష్ణ రావు అన్నారు.. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు వాకిటి సత్యం రెడ్డి.మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు .పుండ్ర శ్రీనివాస్ రెడ్డి. మాజీ జడ్పిటిసీ జలపతి రెడ్డి. మెటుపల్లి పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగన్న. కోరుట్ల మండల అధ్యక్షుడు కొంతం రాజాం. కోరుట్ల పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి. కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు శశిథర్ రెడ్డి. తుపాకుల బాజన్న. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ. కోరుట్ల మండల యూత్ అధ్యక్షుడు పన్నల అంజి రెడ్డి. కిసాన్ సెల్ నాయకులు సంతోష్ రెడ్డి..కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి. యూత్ కాంగ్రెస్ నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు…

ఇఫ్తార్లకే పరిమితమైన ముస్లింల అభివృద్ధి !

జగిత్యాల పట్టణంలో అంతర్గం రైతు ఉత్పత్తి దారుల సహకార సంఘం వారి ఆధ్వర్యంలో లో రైతు నుండి నేరుగా వినియోగదారునికి చేరేల తయారు చేసిన కారంపొడి, పసుపు పొడుల పాకెట్స్ లను మున్సిపల్ కాంప్లెక్స్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, ,మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావని ప్రవీణ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మండల రైతు బంధు కన్వీనర్ నక్క రవీందర్ రెడ్డి, సర్పంచ్ నారాయణ, వ్యవసాయ అధికారి సురేష్ , హార్టికల్చర్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్, రైతులు,సంగ సభులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.