రాష్ట్రంలో 5,500 ప్రాథమిక ప్రధానోపాధ్యాయుల పోస్టులు ప్రభుత్వం త్వరలో మంజూరు చేయనుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి తెలిపారు. సోమవారం ధర్మపురి క్షేత్రం లో జరిగిన PRTUTS రాష్ట్ర కార్యదర్శి, దహేగాం గణేష్ కుమారుడి ఉపనయన కార్యక్రమానికి ఎమ్మెల్సీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో పరస్పర బదిలీలు, పదోన్నతుల, ప్రక్రియ ఆరంభంకానున్నాయి అన్నారు. పదోన్నతుల్లో భాగంగా MEO , పోస్టులు కూడా ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు. పరస్పర బదిలీలు ,చేసుకున్నా ఉపాధ్యాయులు, అందరికీ ఉమ్మడి జిల్లా పరిధిలో సర్వీస్ ప్రొటెక్షన్, తప్పకుండా ఇప్పి చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు. PRTUTS రాష్ట్ర అధ్యక్షుడు, శ్రీపాల్ రెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, అమర్ నాథ్ రెడ్డి, ఆనంద్ రావులు ,రాష్ట్ర నాయకులు AVN రాజు, ఉపాధ్యాయ సంఘ నాయకులు మహేష్, శ్రీనివాసరెడ్డి, బాసిత్ , ప్రకాష్ రెడ్డి , లింగా రెడ్డి, రాజేందర్ రెడ్డి, భూపాల్ రావు, హరీష్, వేణుగోపాల్ రావు ,విజయ్ కుమార్, విద్య ,పద్మ ,తదితర ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ తో పాటు ఉపనయన కార్యక్రమంలో ఉన్నారు.