ఘనంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ పుట్టినరోజు వేడుకలు!

మంత్రి కొప్పుల ఈశ్వర్  పుట్టినరోజు సందర్భంగా సందర్భంగా బుధవారం మంత్రి దంపతులు హైదరాబాద్ లోని అమీర్ పేట్ దుర్గ అమ్మవారి ఆలయం లో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.   మంత్రి ఈశ్వర్ కుటుంబ సభ్యులతో ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు.


హైదరాబాదులోని  స్టేట్ హోంలో ఉన్న శిశు విహార్ లో వివిధ కారణాల వల్ల తల్లిదండ్రులు, ఇండ్లకు దూరమైన పిల్లల మధ్య  కొప్పుల ఈశ్వర్ ,తన కుటుంబ సభ్యులతో కలసి 63.వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.
అనంతరం పిల్లలతో కూర్చోని ఆప్యాయం గా దగ్గరకు తీసుకొని, వారితో ముచ్చటించిన మంత్రి పిల్లలతో కేక్  కట్ చేసి వారికి తినిపించారు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన ,గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా తన పుట్టినరోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో  మంత్రి కొప్పుల ఈశ్వర్  మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి .మాట్లాడుతూ ,ఎంపీ సంతోష్ కుమార్, చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు నా వంతు కృషి చేస్తా అన్నారు..


ది కింగ్ ఆఫ్ హూమానిటీ బుక్ లెట్  ఆవిష్కరణ !


మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ సహకారంతో విజయవంతంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలతో కూడిన బుక్ లెట్ ను పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, టిఆర్ఎస్ ప్రముఖులు,  శ్రీనివాస్ రావు తో కలిసి ఆవిష్కరించారు.

మంత్రి పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా సాహితీ విభాగ కన్వీనర్ నూతి మల్లన్న “ది కింగ్ ఆఫ్ హూమానిటీ”పేరుతో ఈ బుక్ లెట్ ను రూపొందించారు.


బుగ్గారం లో


బుగ్గారం మండల కేంద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  జడ్పిటిసి బాదినేని రాజేందర్  ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాదినేని రాజేందర్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ గారు ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడే వ్యక్తి అని పేద ప్రజలకు అండగా ఉండే మహా నాయకుడు అని తెలిపారు. అదేవిధంగా  ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని  అన్నారు
అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.


మెట్పల్లి లో


మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్  జన్మదిన. వేడుకలను . ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్  రావు, జడ్పీ చైర్పర్సన్ . శ్రీమతి దావా వసంత,ఆధ్వర్యంలో నిర్వహించారు.  సందర్భంగా సింగర్ మల్లిక్ తేజ, బృందం కొప్పుల ఈశ్వర్  మీద పడిన పాటల సి.డి ని  వారు ఆవిష్కరించారు.


జగిత్యాలలో..


జగిత్యాల జిల్లా కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ ,  63 వ జన్మదిన వేడుకల్లో భాగంగా ధర్మపురి లయన్స్ క్లబ్ అధ్యక్షులు  పిన్న శ్రీనివాస్ , ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి ట్రస్టు ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి   జగిత్యాల పట్టణంలోని సివిల్  హాస్పిటల్లో 200 మందికి  అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సెక్రెటరీ కట్ట శ్రీహరి , లయన్స్ సభ్యులు డాక్టర్ రామకృష్ణ, సాయిని సత్తయ్య , కొండ వినయ్ కుమార్, పప్పుల శ్రీనివాస్, రంగా  హరినాథ్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.


ధర్మపురిలో


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో  మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య, కౌన్సిలర్లు,ఆలయ అభివృద్ధి కమిటీ  సభ్యులు ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ శ్రేణులు మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు , హోమాది కార్యక్రమాలు చేశారు.  జెడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ, మండల పరిషత్ అధ్యక్షుడు ఎడ్ల చిట్టిబాబు, మార్కెట్ కమిటీ, మాజీ చైర్మన్ రాజేష్ కుమార్,  టిఆర్ఎస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.