మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అక్క పల్లి గ్రామ సమీపంలో గాయత్రి యజ్ఞం మే 15న జరుగనున్నది.
స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ‘ నరసింహులు బండ’. దగ్గర ఈ పవిత్ర కార్యక్రం జరగనున్నట్లు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం కమిటీ అక్క పెళ్లి భక్త బృందం తెలిపారు.. శ్రీ నరసింహ జయంతి మరుసటి రోజు అనగా ఆదివారం స్వస్తి శ్రీ శుభ కృత నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్థి రోజున, ఉదయం 6 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యజ్ఞం జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

గాయత్రి జపం, తర్పణం, హోమం, అత్యంత వైభోగం జరుపబడునని భక్తులందరూ పాల్గొనవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. పగలు 12 గంటల నుండి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు
ఇక్కడ చూడదగ్గ అతి ప్రాచీన ఆలయాలు అగస్తేశ్వర స్వామి ఆలయం, శ్రీ జగన్నాథ స్వామి ఆలయం, సీతారాముల ఆలయం, మల్లన్న స్వామి ఆలయం, కాల భైరవ స్వామి ఆలయం, దగ్గర్లో ఉంటాయని వారు తెలిపారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రానికి, కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే. గాయత్రీ యజ్ఞం జరుగనున్నట్లు ప్రకటనలలో వారు వివరించారు.
పోస్ట్ చాలా బాగుంది, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము