ఇసుక తరలింపు కు ముహూర్తం ..?

J. Surender Kumar.

గోదావరి నది తీరం కొందరి పాలిట కల్పతరువుగా మారింది. సహజ సిద్ధమైన ఇసుక నదిలో నిలువలు పేరుకుపోవడంతో. రేపో మాపో రవాణాకు కొందరు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుగా ప్రవహిస్తున్న గోదావరి నది లో. భారీగా ఇసుక నిల్వలు పేరుకుపోవడంతో దండేపల్లి, జన్నారం మండలాలకు చెందిన కొందరు, ఇసుక అక్రమ రవాణా దారులు,. కొందరు అధికారులు, ఉగాది న ముహూర్తం ఖరారు చేసుకొని వందలాది ట్రాక్టర్ల ద్వారా దండేపల్లి, జన్నారం ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు.

గోదావరీ నది లో అక్రమ రవాణా ఇసుక ట్రాక్టర్లు !

జగిత్యాల్ జిల్లా నదీ తీరం హద్దుల్లో కి వారి ట్రాక్టర్లు వచ్చి, ఇసుక నిల్వలు తరలిస్తున్న అధికార యంత్రాంగం అటువైపు దృష్టి సారించడం లేదు అనే . విమర్శలు వినిపిస్తున్నాయి. ధర్మపురి తిమ్మాపూర్ బూరుగు పల్లె, రాయపట్నం ,దమ్మన్నపేట ,రాజారాం, జైన ఆరేపల్లి ,రేకులపల్లి, కొలువై గ్రామాల నది తీరంలో భారీగా ఇసుక నిల్వలు సహజసిద్ధంగా ఉన్నాయి. కొంతమంది అక్రమ రవాణా దారుల కన్ను ఇసుక నిల్వలపై పడింది. నిల్వలు తరలింపుకు మంతనాలు జరిపి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.

గోదావరి నదీ తీరం కొందరి పాలిట కనక వర్షం కురిపించే కల్పతరువుగా మారింది. సహజ వనరులైన ఇసుకను కొందరు అక్రమంగా తరలిస్తూ ప్రకృతి సమతుల్యము ను దెబ్బతీస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. అక్రమ రవాణాను అడ్డుకొని, అరికట్టాల్సిన అధికార యంత్రాంగంలో కొందరు, వారి నుంచి అడ్డగోలుగా అందినంత గా కట్నకానుకల రూపంలో దోచుకుంటున్నారు అనేది కూడా అంతే నిజం.


ఇతర జిల్లాల కు చెందిన అధికార యంత్రాంగం. ( ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం, దండేపల్లి) రవాణాకు అనధికార అనుమతులు ఇవ్వడంతో. పలు రకాలు గా ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ధర్మపురి గోదావరి నదీ తీరంలోని ఇసుక నిలువలను అక్రమంగా ,అధికారికంగా తరలించకుండా చర్యలు చేపట్టి ప్రకృతి సమతుల్యం కాపాడాల్సింది గా ప్రజలు కోరుతున్నారు. గత 15 రోజుల క్రితం జరిగిన ధర్మపురి జాతర ఉత్సవాల లో లక్షలాది మంది భక్తజనం తరలి వచ్చి పవిత్ర స్నానాలు చేసే ఇక్కడే మకాం వేసి ఇసుకతిన్నెలపై సేద తీర్చుకున్న విషయం విధితమే.

జాతరలో ఇసుక తిన్నెలు భక్తుల నివాసం.

ప్రస్తుతం వేలాది హనుమాన్ భక్తులు గోదావరి నది స్నానాలు కోసం నిత్యం తరలివస్తున్నారు. నిత్యం భక్తజనం గోదావరి నది లో.పవిత్ర స్నానాలు చేస్తూ అహ్లాదకరమైన, సహజసిద్ధమైన, అపురూప, నైసర్గిక నది తీరం, స్వరూపంను, ఇసుక నిల్వల విధ్వంసం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా భక్తజనం జిల్లా యంత్రాంగాన్ని ముక్తకంఠంతో కోరుతున్నారు.