ప్రభుత్వ పథకాలపై శ్రద్ధ వహించాలి -కలెక్టర్ జి రవి !

ప్రభుత్వ పథకాల పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. మన ఊరు మన బడి, దళిత బంధు పథకం, 10వ తరగతి పరీక్షలు, రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ, కరోనా వ్యాక్సినేషన్ మొదలైన ప్రభుత్వ కార్యక్రమాల పై కలెక్టర్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దళిత బంధు!

జిల్లాలో 346 దళిత బంధు లబ్ధిదారులకు సంబంధించి ఈ యూనిట్లను మంజూరు చేశామని,ఇందులో ఇప్పటివరకు 93 యూనిట్లు గ్రౌండ్ అయ్యాయని మిగిలిన వాటిని త్వరగా. గ్రౌండ్ చేసే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కోనుగోలు కమిటీ సమావేశమై, గ్రౌండ్ చేసేందుకు అవసరమైన పరికరాల కొనుగోలు ఏజెన్సీ, తదితర అంశాలపై నివేదిక తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దళిత బంధు కింద 2 రోజుల్లో 200 మంది లబ్ధిదారులకు సంబంధించిన సంపూర్ణ నివేదికలు తయారవుతున్నాయని, వారి ఖాతాల్లో నిధులు జమ చేయడం జరుగుతుందని అధికారులు వివరించారు. మండల కమిటీలు సంబంధిత లబ్ధిదారుల యూనిట్ల గ్రౌండింగ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందిస్తే, దాని ప్రకారం బ్యాంకులు నిధులు రిలీజ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

మన ఊరు మన బడి!

మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంపికైన 274 పాఠశాలల్లో చేపట్టాల్సిన పనుల వివరాలు ముందస్తుగానే సేకరించినప్పటికీ, ప్రతిపాదనల తయారీలో జరుగుతున్న ఆలస్యం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మన ఊరు మన బడి ప్రతిపాదన ఆమోదంలో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు లాగిన్ లో వచ్చే ప్రతిపాదనలను సరిచూసి ఎప్పటికప్పుడు ఆమోదించే విధంగా ఆదేశాలు జారీ చేయాలి కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. మన ఊరు మన బడి ప్రతిపాదనలు తయారీపై ఇంజనీరింగ్ విభాగాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సూచించిన 12 అంశాల్లో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన మేర టాయిలెట్ల నిర్మాణం, త్రాగునీటి సౌకర్యం, ఫర్నిచర్, అదనపు గదుల నిర్మాణానికి చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 6500 విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్నారని,
ప్రతి విద్యార్థి ప్రత్యేక తరగతులకు హాజరై 100% ఉత్తీర్ణత

సాధించే దిశగా కృషి చేయాలని కలెక్టర్

సూచించారు.ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక

తరగతులకు గైర్హాజరవుతున్న విద్యార్థుల వివరాలు

సేకరించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్

సూచించారు.

పెండింగ్ వ్యాక్సినేషన్ !

పెండింగ్ వ్యాక్సినేషన్ త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని, ప్రతి 3వ శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

మున్సిపల్ !

మున్సిపాలిటీలలో పెండింగ్ టీబీపాస్ దరఖాస్తులను పూర్తిచేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భవన నిర్మాణాలకు అనుమతులు సకాలంలో జారీ చేయాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.
మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రస్తుత పరిస్థితి నుంచి మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. మున్సిపాలిటీలో 100% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ టాక్స్ వసూలు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను పరిసరాలను పరిశుభ్రం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని, సీఎం ఆఫీస్ దరఖాస్తులను పరిష్కరించి వివరాలను పోర్టల్ లో నమోదు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

పెండింగ్ విద్యుత్ బిల్లులు !

జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ విద్యుత్ బిల్లులను అందుబాటులో ఉన్న బడ్జెట్ మేరకు చెల్లించాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీలలో గ్రామాల్లో అనుమతి లేకుండా ఉన్న పోస్టర్లను , హోర్డింగ్ బోర్డులను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు‌‌.

రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు !!

జిల్లాలో 5500 రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధం ఉన్నాయని వాటిని నిబంధనలను అనుసరించి పారదర్శకంగా పంపిణీ చేయాలని కలెక్టర్ మైనారిటీ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మసీదులో ఇఫ్తార్ పార్టీ నిర్వహణకు 11 లక్ష్యాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, స్థానిక ఎమ్మెల్యే తో సమన్వయం చేసుకుంటూ మసీదుల ఎంపిక చేసి ఇఫ్తార్ పార్టీకి , గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. పేద ముస్లిం వర్గాలకు ప్రభుత్వం రంజాన్ తోఫా కానుకలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఇంచార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు


-భారత మాజీ ఉప ప్రధాని శ్రీ స్వర్గీయ బాబు జెగ్జివన్ రామ్ గారి115 వ జయంతి ఉత్సవమును మంచినీళ్ల బావి వద్ద మంగళవారం రేపు ఉదయం 10.00.గంటలకు జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని డీ.ఎస్.డి.ఓ రాజ్ కుమార్ గారు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.