ధర్మపురి పట్టణంలో ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ గ్రంధాలయాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు అన్నారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్యాడ్స్, కుర్చీలను,కులర్ అందజేశారు.

ఈసందర్భంగా గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ ,మాట్లాడుతూ, గ్రూప్ 1, 2 తోపాటు, పోలీస్, డిఎస్సి మొదలైన .అన్నిరకాల పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం పుస్తకాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో ,డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, గ్రంధాలయ సెక్రెటరీ సరిత, ,ధర్మపురి గ్రంధాలయ ఇంచార్జ్ శ్రీరంగం, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.

విగ్రహ ఆవిష్కరణ !
జగిత్యాల జిల్లా దరూర్ లో డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్ పాల్గొని పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ , జెడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత , గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ చంద్రశేఖర్ గౌడ్ , దళిత సంఘాల సభ్యులు పాల్గొన్నారు

రాయపట్నం ఎక్స్ రోడ్ వద్ద గరుడ విగ్రహం !
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, మరియు పట్టణం పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శనివారం మంత్రి ఈశ్వర్ అధికార యంత్రాంగం తో రాయపట్నం, నరసయ్య పల్లె ,తదితర స్థలాలను పరిశీలించి ఎంపిక చేశారు. దాదాపు కోటి 30 లక్షల వ్యయంతో గరుడ విగ్రహం, స్వాగత తోరణాలు, రాయపట్నం క్రాస్ రోడ్ వద్ద సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు.. ₹ 30 లక్షల తో నిర్మించబోయే గరుడ విగ్రహ ఏర్పాటుకు మరియు రాయపట్నం, నర్సయ్య పల్లె రోడ్డు ఫై కోటి రూపాయల తో నిర్మించబోయే స్వాగత తోరణాల నిర్మాణానికి స్థలాన్ని మంత్రి అధికారులు టిఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.