ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం దేవస్థానం తర్వాత. అంతటి ప్రాధాన్యత ప్రాచుర్యం గల. శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఇల్లంతకుంట దేవస్థానమునకు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పక్షాన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు, అనాదిగా వస్తున్న సాంప్రదాయం మేరకు శనివారం ఇల్లంతకుంట ఈ క్షేత్రానికి వెళ్లి అక్కడి ఆలయ అర్చకులు , కార్యనిర్వహణాధికారికి అప్పగించారు.

ఇల్లంతకుంట ఆలయ అర్చకులు అధికారులు మేళతాళాలతో వీరికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ,వేదపండితులు ముత్యాల శర్మ , రెనవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామన్న , పల్లెర్ల సురేందర్, అక్కనపల్లి సురేందర్, వేముల నరేష్, చుక్కరవి ,సంగెం సురేష్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ ,జూనియర్ అసిస్టెంట్ తిరుపతి ,పాల్గొన్నారు.

శ్రీ లక్షి నరసింహస్వామి వారికి అనుభంద దేవాలయమైన స్వర్గీయ మాజీ దేవాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు స్వగ్రామమైన తిమ్మాపూర్ లో శనివారం కలషస్థాపన ,విశ్వక్సేనపూజ ,వాసుదేవపుణ్యాహవాచనం , ఋత్విక్ వర్ణపూజ , రక్షాబంధనం ,అంకురార్పణ ,అగ్నిప్రతిష్ఠ , కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ఉపప్రదాన అర్చకులు నేరెళ్ళ శ్రీనివాసాచార్య , అర్చకులు నేరెళ్ళ విజయ్ కుమార్ ,నంభి అరుణ్ కుమార్ ,నేరెళ్ళ మోహనాచార్య , బొజ్జ రాజగోపాల్ , సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ , రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య , గునిశెట్టి రవీందర్ ,అక్కనపల్లి సురేందర్ , వీరవేణి కొమురయ్య పాల్గొన్నారు.
శ్రీ రామాలయం లో..
ధర్మపురి క్షేత్రంలో గోదావరి నది తీరాన గల అతి పురాతనమైన శ్రీ రామాలయం లో ( తాడూరి వంశీయుల ది) అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు చేయుటకు సుందరంగా అలంకరించారు. ఈ ఆలయంలోని శ్రీరామచంద్రమూర్తి విగ్రహానికి మీసాలు కలిగి ఉండడం ఆలయానికి ఎదురుగా హనుమంతుడి గుడి ( హనుమాన్ గడ్డ) ప్రత్యేకత.

శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో శ్రీరామనవమి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశామని అభివృద్ధి కమిటీ కన్వీనర్ జీవిత పరమేశ్వర్ అధ్యక్షులు కటం రాజన్న శంకర్ తెలిపారు. ఎక్కడి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి ధర్మపురి మున్సిపల్ 11 వార్డు కౌన్సిలర్ జక్కుపద్మ రవీందర్ నంది విగ్రహం. ఉదయం 9 గంటల నుండి ఇ సాయంత్రం 6 గంటల వరకు కాలనీ వరకు భక్తుల సౌకర్యం కోసం ఉచిత వాహనం ఏర్పాటు చేయడంతో పాటు వాహన డ్రైవర్ ఫోన్ నెంబర్ ను కూడా వారు ప్రకటనలో పేర్కొన్నారు.
గండి హనుమాన్ లో
ఆదివారం రోజున ఉదయం తిమ్మాపూర్ గండి హనుమాన్ దేవాలయం లో శ్రీ సీత రామ కళ్యాణం కార్యక్రమం అనంతరం అన్నదానం కలదు. ప్రతి సంవత్సరo లాగే ఈ సంవత్సరo కూడ దాత,డాక్టర్ కస్తూరి శ్రీధర్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.