గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న మా నివేశన స్థలాలను మాకే పట్టాలు ఇవ్వాలి అంటూ బీర్పూర్ మండలం కోమల పల్లి గ్రామస్తులు శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

బీర్పూర్ మండలంలోని కోమన్ పల్లి గ్రామంలో ,శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ముంపుకు గురైన బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయించగా ,లబ్ధిదారులు వచ్చిన కొంత కాలానికే తిరిగి వారి స్వంత ప్రాంతానికి వెళ్లిపోయారు, ఐతే వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలు అమ్మకానికి అవకాశం లేనందున వారు వదిలేసి వెళ్లిపోయారు, .అట్టి నివాస స్థలాల్లో గత 30 సంవత్సరాలుగా మా గ్రామ ప్రజలు నివాసాలు ఏర్పరచుకొని నివాసం ఉంటున్నారు, కానీ అట్టి ఇళ్ల స్థలాలకు సంబంధించిన హక్కు పత్రాలు ఎవరికి లేవు .మేము గత ముప్పై సంవత్సరాలుగా ఇదే గ్రామంలో నివాసం ఉంటున్నాము కాబట్టి మాకు, మేము నివసిస్తున్న ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించాలని వినతి పత్రం లో వారు పేర్కొన్నారు. .ఈ కార్యక్రమంలో కోమన్ పల్లి సర్పంచి సీపతి రమేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గున్నారు.

విజయవంతం చేయాలి !
ఈ నెల 27న జరగనున్న తెరాస పార్టీ ఆవిర్భావ సభను నియోజకవర్గ శ్రేణులు విజయవంతం చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈనెల 27వ తేదీన నిర్వహించుకోబోయే టీ.ఆర్.ఎస్ పార్టీ 21వ ఆవిర్భావదినోత్సవ వేడుకలకు సంబంధించి పట్టణ టీ.ఆర్.ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల,ముఖ్య నాయకుల సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, ,లైబ్రరీ చైర్మన్ డా.చంద్ర శేకర్ గౌడ్, .మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ గారు, ,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, .పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆనంద్ రావు, వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మున్సిపల్ కౌన్సిలర్స్ ,యూత్ నాయకులు, మైనారిటీ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు భూమిపూజ
జగిత్యాల పట్టణంలోని
7వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా రూ:30 లక్షలతో సిసి రోడ్డులు మరియు సిసి డ్రైనేజిల నిర్మాణం కోసం భూమిపూజ చేసిన శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డా. బోగ శ్రావణి ప్రవీణ్ లు శుక్రవారం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ వల్లేపు రేణుక-మోగిలి ,కో ఆప్షన్ మెంబర్ వడకపురం శ్రీనివాస్ కౌన్సిలర్ లు,టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ..!!