ఇంటర్ పరీక్షల నిర్వహణ పై కలెక్టర్ సమీక్ష !

జగిత్యాల, ఏప్రిల్ 26
జిల్లాలో ఇంటర్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ పై మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టరెట్ లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించుటకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. మే 6, 2022 నుంచి, మే 24, 2022 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జగిత్యాల జిల్లాలో 8945 ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు,8907 ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులు, మొత్తం 17852 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు.
జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 30 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇంటర్ పరీక్షల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పరిక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


జిల్లాలో ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నపత్రాలను నిల్వజేయుటకు పోలిస్ స్టేషనలొ తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రశ్నపత్రాలకు పోలిసు ద్వారా బందొబస్తు కల్పించాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల వద్ద మంచి నీరు వుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని , వెలుతురు వుండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్ష నిర్వహణ అనంతరం సమాధాన పత్రాలను సరిగా సీల్ చేసి పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ పకడ్భందిగా చెపట్టాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సరైన సమయంలో చేరుకునే విధంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ సూచించారు.
జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి , సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.

మన ఊరు మన బడి !


జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో పనుల గ్రౌండింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ మంగళవారం సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.
జిల్లాలో మొదటి దశలో 274 పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద ఎంపిక చేయగా ఇప్పటివరకు 267 పాఠశాలల ఇన్ ఫుట్ డాటా ఎంట్రీ,258 పాఠశాలలో లీడ్ స్టేట్మెంట్, 200 పాఠశాలల ప్రతిపాదనలు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.
గొల్లపల్లి ,కోరుట్ల , మల్లాపూర్ మండలాల్లో 2 ఇన్ ఫుట్ డాటా ఎంట్రీ, మేడిపల్లి మండలంలో 6 పాఠశాలల లీడ్ స్టేట్మెంట్ పెండింగ్ ఉండటానికి గల కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పాఠశాలలో కొలతలు తీసుకుని ఇన్ ఫుట్ డాటా ఎంట్రీ పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు మేడిపల్లి మండలంలో లో ప్రధాన రహదారికి పక్కనే పాఠశాల ఉన్నందున, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు దరఖాస్తులు వస్తున్నాయని, దీనిపై విద్యాశాఖ తమ అభిప్రాయం తెలియ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో 155 పాఠశాలల అభివృద్ధి ప్రాజెక్ట్ తయారు చేశామని వాటిలో 116 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు, 99 పాఠశాలలకు సాంకేతిక అనుమతులు మంజూరు చేశామని కలెక్టర్ తెలిపారు.
రూ.30 లక్షల కంటే అధికంగా ఉన్న పాఠశాల అభివృద్ధి పనుల సాంకేతిక అనుమతులు జారీ అవకాశం ఈఈ లాగిన్లో లేదని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సాంకేతిక నిపుణులు సూచించారు.
జిల్లాలో 91 ప్రాజెక్టులకు ఎంఓయు జనరేట్ చేశామని, 53 ప్రాజెక్టుల ఎంఒయూ పై సంతకాలు పూర్తిచేశామని ,5 ప్రాజెక్టుల ఎంఓయు తీర్మానాలు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రతి పాఠశాల ఎంఓయూ జనరేట్ చేసి, సంబంధిత అధికారుల, పంచాయతీలో తీర్మానం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ఇంజనీర్లు సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

రోడ్డు భద్రత సమావేశం !


జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రత సమావేశాన్ని మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించారు.
ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారుల, ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయతీ రోడ్ల వద్ద ఉన్న ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
రోడ్డు సమీపంలో గల బావుల వద్ద గేట్ వాల్ ఏర్పాటు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ నిధులతో వీటిని చేపట్టాలని కలెక్టర్ సూచించారు. రోడ్లపై వ్యూ అంతరాయం కలగకుండా పిచ్చి మొక్కలు పూర్తిస్థాయిలో తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతూ రావాలని, దాని కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో వినియోగిస్తున్న ట్రాక్టర్లు, కేజీ వీల్స్ సమస్య రాకుండా చూడాలని, సీజ్ చేసిన వాహనాలను పట్టి కోనుగోలు చేసిన అనంతరం మాత్రమే విడుదల చేయాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్ పి సింధు శర్మ మాట్లాడుతూ 2021 సంవత్సరంలో 199 అవగాహన కార్యక్రమాలను ట్రాఫిక్ పోలీస్ ద్వారా చేపట్టామని అన్నారు. ఇప్పటివరకు 2093 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని, వీటిలో మైనర్లు సైతం ఉన్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య దురదృష్టవశాత్తు తగ్గడం లేదని అన్నారు. జనవరి నుంచి మార్చి మాసం వరకు 115 వాహన ప్రమాదాలు జరిగాయని, వీటిలో సగం కంటే అధికంగా జాతీయ రహదారి లో 4, 5 ప్రదేశాలు జరిగాయని తెలిపారు.
ధర్మపురి ,జగిత్యాల రూరల్ మెట్పల్లి, మేడిపల్లి, కోరుట్ల ప్రాంతాల్లోని జాతీయ రహదారులో ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు.
జిల్లా రవాణా అధికారి శ్యాం నాయక్ , ఎం.వి.ఐ. వంశిధర్ ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీధర్, జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీధర్ జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్వరూపరాని, ఈఈ పంచాయతీ రాజ్,ఈఈ ఆర్ అండ్ బీ, టౌన్ ప్లానింగ్ అధికారి శాఖ అధికారి సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.


రంజాన్ వేడుకలకు భారీ ఏర్పాట్లు !


జిల్లాలో రంజాన్ పర్వదిన వేడుకలు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.రంజాన్ ఏర్పాట్లపై ముస్లిం మత పెద్దలు సంబంధిత అధికారులతో కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
ముస్లిం సోదరులు సామూహిక నమాజ్ చేసే ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మసీదులో టెంట్ల ఏర్పాటు త్రాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీల వారిగా చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ రివ్యూ తీసుకున్నారు.
మసీదుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, దోమల సమస్య రాకుండా ఫాగింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో త్రాగునీటి, స్ట్రీట్ లైట్ వన్డే సమస్యలు ఉత్పన్నం కాకుండా మున్సిపల్ కమిషనర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.


సమావేశంలో పాల్గొన్న ఎస్ పి సింధు శర్మ మాట్లాడుతూ రంజాన్ పర్వదిన ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మార్చి 31న కలెక్టర్ ప్రతి శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, వాటిని తప్పకుండా పాటించాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో రంజాన్ పర్వదిన వేడుకలు నిర్వహించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్. లత , జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీమతి ఆర్.డి.మాధురి , ఇంచార్జి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి లక్ష్మీ నారాయణ, మునిసిపల్ కమిషనర్,లు సంబంధిత అధికారులు ముస్లిం మత పెద్దలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు