సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు (డైరక్టర్) గా బి. రాజమౌళి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జిఓ నంబర్ 875 ద్వారా ఉత్తర్వులు జారీ చేసి నియామకం చేసింది.
తనను డైరక్టర్ గా నియమించినందుకు మంగళవారం ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్జతలు తెలిపారు..

రాజమౌళి రెండు సంవత్సరాలు సమాచార డైరెక్టర్ గా కొనసాగుతారు. రాజమౌళి గతంలో సమాచార శాఖలో వివిధ హోదాల్లోపనిచేసి పదవీవిరమణ చేశారు. పదవీ విరమణ అనంతరం రెండు సంవత్సరాలు తెలంగాణ మీడియా అకాడమీ సెక్రటరీగా పనిచేశారు. తిరిగి రెండు సంవత్సరాల తర్వాత సమాచార డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. రాజమౌళి ని చిన్న పత్రికల సంఘం తరపున శుభాకాంక్షలు తెలిపారు.

ఏవో చంద్రమోహన్ రెడ్డి కి ఘన వేడుకలు !
డీజీపీ ఆఫీస్ కి బదిలీ పై వెళుతున్న A.O చంద్రమోహన్ రెడ్డి ని మంగళవారం జగిత్యాల జిల్లా పోలీసు యంత్రాంగం ఘనంగా సన్మానించి వీడుకోలు . పలికారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ AO చంద్రమోహన్ రెడ్డి క్రింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, సమర్థవంతంగా విధులు నిర్వహించారని అన్నారు. పోలీస్ శాఖ లో నూతనంగా ప్రవేశపెట్టిన HRMS ను జిల్లా లో ఇంప్లిమెంటేషన్ చేయడం లో ప్రముఖ పాత్ర వహించరని అన్నారు. జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న పై స్థాయి అధికారుల నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు సర్వీస్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కృషి చేసినందుకు అభినదించారు. బదిలీ అయిన చోట కూడా ఇదేవిధంగా విధులు విధులు నిర్వహించాలని సూచించారు.
అనంతరం A.O.మాట్లాడుతూ జిల్లా లో సుమారు 2 సంవత్సరాల పాటు నిర్వర్తించిన విధులు సంతృప్తి నిఛ్చాయని, పోలీస్ అధికారులు,DPO కార్యాలయం సిబ్బంది సహకారం మరువలేనిది అన్నారు.
ఈ కార్యక్రమంలో DCRB డీఎస్పీ రాఘవేంద్రరావు, RI లు నవీన్, వామనమూర్తి, సైదులు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్, మరియు DPO కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.