జగిత్యాలలో ₹3.32 కోట్లో పనులకు శంకుస్థాపన !

పట్టణ ప్రగతి నిధులు రూ.3032 కోట్లతో వినిపిస్తున్న అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేలు జగిత్యాల పట్టణంలో జంక్షన్ డెవలప్మెంట్ సెంట్రల్ మీడియా వాల్ పెయింటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు డంపింగ్ యార్డ్ వద్ద FSTP ప్లాంటును మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ
నుకపెళ్లి లో డబల్ బెడ్రమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారంటే  సరే అనుకున్న కానీ ఇంత అద్భుతం గా 4500 ఇల్లు నిర్మాణం చేపడ్తున్నారాని, దాదాపు అన్ని ఇల్లు నిర్మాణం పూర్తి కావస్తోంది చూస్తుంటే తెలుస్తుందన్నారు. ఇదంతా ఎమ్మెల్సీ కవిత  కృషి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తం గా ఎన్ని ఆశ్చర్యనికి గురయ్యే పథకాలను అమలు చేస్తోందన్నారు. జగిత్యాల జిల్లా కావడం మన అదృష్టం, అని తెలంగాణా రాష్ట్ర ఏర్పడం తో జిల్లా గా ఏర్పడి జిల్లా కేంద్రం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు..కలెక్టరేట్ ని చూస్తే వేరే రాష్ట్రాలలో సచివాలయం లాగా కనబడుతోందన్నారు..
జిల్లాకి కేంద్రంలో మెడికల్ కాలేజి మంజూరైంది, ఇప్పుడు మనం జిల్లాని దాటి వేరే ప్రాంతానికి మెడికల్ డిగ్రీ చదవడానికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు..రాష్ట్ర ప్రభుత్వం అధునాతన మార్కెట్లు ఏర్పాటు చేస్తోంది, రోడ్ల వెడల్పు, డ్రైనేజీలు, చెరువులు,  ఇంకా మన ఊరు మన బడి కార్యక్రమం ఎంతో గొప్ప పతకం గా ఉందన్నారు, ఇదంతా కేసీఆర్ గారి గొప్పతనం అని తెలంగాణ రాష్ట్రం లో ఏ ఒక్క ఇంటికి కూడా ప్రభుత్వం సహకారం లేని ఇల్లు లేవని చాలా గొప్పగా చెపౌకోవచ్చు అన్నారు.. ఇంకో సంవత్సరం కాలంలో ఈ కేసీఆర్ కాలనిలో ఇళ్ల పంపిణీ చేస్తామని, మౌలిక వసతులు కల్పించి అందిస్తామని, తన వంతుగా కూడా సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఛైర్పర్సన్ గర్లకు అభినందనలు తెలియజేశారు…


ఎమ్మెల్సీ ఎల్ రమణ  మాట్లాడుతూ…
దక్షిణ భారతదేశం లో బారి పతకం, డబల్ బెడ్రమ్ ఇళ్ల నిర్మాణం అని, 200 కోట్ల పైగా నిధులతో దాదాపు 5000 ఇళ్ల నిర్మాణం చేయడం అభినందనీయం. రాజకీయాల్లోకి రాకముందు తాను ఒక కట్రాక్టరే అని అందుకని  వారిబాధ్యతలు తనకి తెలుసునాని, కాంట్రాక్టర్లు ఏమి ఆశించకుండా ఒక గొప్ప నగరాన్ని కేసీఆర్ నగర్  నిర్మాణం చేస్తున్నారన్నారు. స్వంత ఇల్లు లేనటువంటి బీదలకు నిర్మాణం కోసం ఇంటికి 3లక్షల,ఏమి లేకపోతే ఇండ్లు కట్టి  ఇస్తున్నామన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం కాబట్టి ఆ స్థాయికి తగ్గట్టుగా అభివృద్ధి కి తన వంతు సహాయలు సమకూరుస్తా మన్నరూ..


ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ.
ఎమ్మెల్సీ కవిత  గారి కృషి వల్ల 4500 డబల్ బెడ్రమ్ ఇల్లు సాధ్యమైందని, దానికి వారి సహకారం ఎంతో ఉంది , వారే స్వయంగా కేసీఆర్ గారి దృష్టి కి తీసుకు వెళ్లి మన జగిత్యాల కి మంజూరు చేపించారన్నారు. ఎమ్మెల్సీ ఎల్. రమణ  జగిత్యాల పై ప్రత్యేక దృష్టి తీసుకోవాని, మౌళిక వసతుల కల్పన కి కృషి చేయాలని కోరుతున్నన్నారు. టి.ఆర్ నగర్ లో మిషన్ భగీరత సంపూ ఏర్పాటు చేసాం అక్కడి నుండి కేసీఆర్ కాలానికి నీటి సప్లై చేస్తున్నామని తెలిపారు…రిజర్వేషన్లు వారిగా ఇల్లు పంపిణీ ఉంటుందని అన్నారు. 2.5 కోట్లతో ఎఫెస్టిపి ప్లాంట్ ప్రారంభించమని సెప్టిక్ ట్యాన్క్ వ్యర్థలను  ఇక నుండి బయట పరబోయకుండా మున్సిపాలిటీ సేకరించి, ఎరువుగా మార్చి మళ్ళీ రైతులకు ఉచితంగా అందజేస్టగుందన్నారు, టిఆర్ నగర్  ప్రకృతి వనం మాడల్ పార్క్ గా అభివృద్ధి చేశాంమని, రాష్ట్రం లోని నెం.1 పార్క్ గా అధికారులు కితాబిచ్చారన్నారు. మాస్టర్ ప్లాన్ కి అనుగుణంగా ఇల్లు కట్టుకోవాలి, రోడ్లు వెడల్పు చెయ్యాలి అంటే సెట్ బ్యాక్ తప్పనిసరన్నారు. కేసీఆర్ నగర్ అభివృద్ధి కి మంత్రివర్యులు, ఎమ్మెల్సీ గార్లు సహకరించాలని జగిత్యాల ప్రజల తరపున కోరుతున్ననాని ఈ సందర్భంగా తెలియజేశారు..


కార్యక్రమంలో  కలెక్టర్ రవి, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి ,జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, ఆర్డీవో మాధురి, కమిషనర్ స్వరూప రాణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో.అప్షన్ సభ్యులు, డి.ఈ రాజేశ్వర్, తెరాస నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు..


సెంటర్ ప్రారంభం!
జిల్లా కేంద్రంలో జమాతే ఇస్లామి హింద్ , నాగరిక వికాస్ కేంద్ర  అధ్వర్యంలో రహునుమా  సెంటర్ ను ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,  జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ , ఎమ్మెల్సీ ఎల్ రమణ లు. ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జమతే ఇస్లామి సెక్రెటరీ అబ్దుల్ హలీం,హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ ఇక్బాల్ హుస్సేన్,Amc వైస్ చైర్మన్ మొసిన్, మైనార్టీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్,షోయబ్ఉల్ హక్,
ముఖీం,కో ఆప్షన్ రియాజ్ మామా,అమీన్ ఉల్ హాసన్, తదితరులు పాల్గొన్నారు.


చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి!
యావత్‌ మహిళా లోకానికి ఐలమ్మ జీవితం స్ఫూర్తి దాయకమని, ఆమె తెగువ మహిళా చైతన్యానికి ప్రతీక అని మంత్రి ఈశ్వర్ అన్నారు .
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో శుక్రవారం మంత్రి కొప్పుల  ఈశ్వర్ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని మంత్రి  అన్నారు. రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మను మహిళ ఉక్కు మహిళ అంటూ, తెలంగాణ మట్టిలోనే పోరాటముందని, అందుకు చాకలి ఐలమ్మ జీవితం గొప్ప నిదర్శనం అని మంత్రి కొప్పుల కొనియాడారు ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు పోనుగోటి శ్రీనివాస్ రావు, యంపిపి కూనమల్ల లక్ష్మీ, జడ్పీటీసి సుధారాణి, స్థానిక సర్పంచ్, యంపిటిసి లు, మరియు తెరాస నాయకులు, రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు

advertisement

అడ్వర్టైజ్మెంట్