జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు

ఆయన దేశానికి సమాజానికి అందించిన సేవలను వారు కొనియాడారు

భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131 జయంతి మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి మరియు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ రాజేష్ గౌడ్ జడ్పీ చైర్మన్ దావ వసంత అదనపు కలెక్టర్ బిఎస్ లత మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి గ్రంథాలయం సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ మరియు షెడ్యూల్డ్ కులాల శాఖ అధికారి రాజ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ ఈ.డి .లక్ష్మీనారాయణ మరియు దళిత సంఘాల నాయకులు కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు మున్సిపల్ కమిషనర్ విద్యార్థులు విద్యార్థినిలు ప్రజలు పాల్గొన్నారు