ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ని తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ ,జస్టిస్ గుండా చంద్రయ్య ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జస్టిస్ చంద్రయ్యకు ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో, మేళతాలాలతో, ఆలయ అధికారులు అర్చకులు, ఘనంగా స్వాగతించారు. జస్టిస్ ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి శేష వస్తానని బహుకరించారు

బీజేపీ నేత వివేక్ పర్యటన !

పెద్దపల్లి నియోజకవర్గం లోని చీకురాయి గ్రామంలో,శ్రీ పోచమ్మ,బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ధర్మపురి నియోజకవర్గం లోని వెల్గటూరు మండలం, గొడిశాలపేట గ్రామంలో, శ్రీ, కేషనాధుని,జాతర లో మరియు,ముంజపల్లి గ్రామంలో, శ్రీ వేంకటేశ్వర స్వామి జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు..
ధర్మపురిలో ఇఫ్తార్ విందు !

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని . ఆదివారం 7వ వార్డ్ కౌన్సిలర్, వేముల నాగలక్ష్మి రాజేష్, ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకి వార్డ్ పరిధిలోని మసీదు వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఇఫ్తార్ విందులో DCC జగిత్యాల్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మైనార్టీ పెద్దలు కౌన్సిలర్ యూనుస్, ,జహంగీర్, షబ్బీర్, అన్వర్, అలీం కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుముల లక్ష్మణ్, సింహారాజు ప్రసాద్, సీపతి సత్యనారాయణ, గణేష్ స్తంభంకాడి ,తదితరులు పాల్గొన్నారు.
సోమవారం జగిత్యాలలో హెల్త్ మేళ !

జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో నీ పద్మనాయక కళ్యాణ మండపంలో సోమవారం హెల్త్ మేళ నిర్వహించనున్నట్టు జిల్లా వైద్యాధికారి ప్రకటనలో పేర్కొన్నారు.
ఆజాదీక అమృత మహోత్సవంలో భాగంగా సోమవారం (18.04.2022) జగిత్యాల పద్మనాయక కల్యాణ మండపంలో, బుధవారం (20.04.2022) మేటుపల్లిలో వాసవి కల్యాణ మండపంలో,మరియు శుక్రవారం (22.04.2022) కోరుట్లలో పద్మశాలి భవనంలో నిర్వహించనున్న హెల్త్ మేళాను విజయవంతం చేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి విజ్ఞప్తి చేశారు.
హెల్త్‌మేళాలో గైన కాలజీ, జనరల్ మెడిసిన్, కంటి పరీక్షలు, దంత పరీ క్షలు, పిల్లల వైద్య పరీక్షలు,. ఈఎన్టీ, ఆయుష్, చర్మ మరియు మానసిక సంబంధిత నిపుణులు సేవలందిస్తారని, ప్రకటనలో వివరించారు.

ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామాల్లో అవగాహన కల్పించాలని, అలాగే ప్రతి ఆరోగ్య సిబ్బంది కూడా కుటుంబ సమేతంగా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగంచుకోవవాలని సూచించారు. ఈ మేళాలో ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటు రక్తనమునాల అన్ని రకాలైన పరీక్షలతో పాటు మందులు కూడా అందజేస్తారని వివరించారు. అవసరమైన వారికి హెల్త్ డిజిటల్ కార్డు కూడా అందజేయడం జరుగుతుంది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ప్రకటనలో వివరించారు.
ప్రారంభోత్సవం !

రాయికల్ . మండలం దావన్ పల్లి గ్రామం లో శ్రీ హనుమాన్ దేవాలయంలో షెడ్డు ను బిజేపి నాయకులు చిలుకమర్రి మదన్ మోహన్., ఆదివారం ప్రారంభించారు. బిజేపి సీనియర్ నేత చిలుకమర్రి మధన్ మోహన్, .గ్రామంలోని కొందరు దాతల సహాకారంతో ఈ షెడ్యూల్ ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా యమున రవీందర్, ఉప సర్పంచ్ బిక్కు నాయక్ , బి జే పీ S T మూర్ఛ డా. తిరుపతి నాయక్, .k రాజు ,వాలు ప్రసాద్ , భుమేష్, వీను జగన్, వీరేశం ,కశిం ,పరశురామ్ ,నర్సయ్య , శేకర్ నర్సయ్య , తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదన్మోహన్ ఘనంగా సన్మానించారు.