రంజాన్ పర్వదినం పురస్కరించుకొని అర్హులైన ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ కానుకలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ అన్నారు.
మంగళవారం సాయంత్రం రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ,మాక్బార మజీద్,.అజారి మజీద్, జామా మజీద్ లలో ప్రార్థనల అనంతరం రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వారి వారి ప్రధాన పండుగలను సంతోషంగా నిర్వహించుకోవాలన్న సమున్నత లక్ష్యం తో బతుకమ్మ చీరలు, రంజాన్ కానుకలను, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపారు.

కరోనా మూలంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికిని సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు. జగిత్యాల పట్టణంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నమని, ఒక్కో విద్యార్థి పై లక్ష వరకు ఖర్చు చేస్తునామని, పండ్ల మార్కెట్ అభివృద్ధి చేస్తున్నామని, పట్టణంలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని పేదలకు మెరుగైన వైద్యం కోసం మెడికల్ కాలేజీ సైతం మంజూరు అయింది అని త్వరలోనే తరగతులు ప్రారంభం కానున్నయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగిని సన్మానించి ఎమ్మేల్యే
జగిత్యాల పట్టణంలో సీఎం సహాయ నిధి,.కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తూ మోతే రోడ్డు లోగల శంకర్ ఘాట్ (మోతె స్మశాన వాటిక) పరిశీలించి, స్మశాన వాటిక గార్డెన్, మొక్కలు సంరక్షిస్తూ, స్మశాన వాటికను పరిశుభ్రంగా ఉంచినందు కు అక్కడ విధులు నిర్వర్తించే మున్సిపల్ ఉద్యోగి రాపర్తి రమేష్ ను ఎమ్మేల్యే డా. డాక్టర్ సంజయ్ కుమార్ శాలువాతో సత్కరించి అభినందించారు.

విత్తన శుద్ధి కర్మాగారం పనులు పరిశీలించిన ఎమ్మెల్యే !
జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామంలో
ప్రభుత్వం రైతుల కోసం రూ. 7 కోట్లతో నిర్మిస్తున్న విత్తన శుద్ధి కర్మాగారాన్ని , పనులను మంగళవారం ఎమ్మేల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు.
ఎమ్మేల్యే మాట్లాడుతూ వ్యవసాయంలో అభ్యుదయ భావాలున్న లక్ష్మి పూర్ గ్రామానికి, విత్తన శుద్ధి కర్మాగారం రావడం చాలా ఆనందకరమైన విషయం అన్నారు. లక్ష్మీపూర్ లో ఏర్పరిచే విత్తన శుద్ధి కర్మాగారం 20 వేల SFT గల సుమారు రూ 7 కోట్ల నుండి 9 కోట్ల రూపాయల తో విత్తన శుద్ధి కర్మాగారం ,ప్రాసెసింగ్ మిషన్, ఆఫీస్ నిర్మాణం జరుగుతున్నాయని అన్నారు. ,వరి, సోయాబీన్, మొక్కజొన్న గల పంటలను రైతులకు సీడ్ ఇవ్వడం, మార్కెట్ రేట్ మీద 25%అదనంగా రైతులకు లాభం అని,30 కీ. మి పరిధి లోపల రైతులకు ఉపయోగపడుతుందని . ఇట్టి ప్రాజెక్ట్ ద్వారా రైతులకు ప్రత్యక్షంగా,.పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎమ్మేల్యే తెలిపారు. మాజీ ఎంపీ,ప్రస్తుత ఏమెల్సి కవిత ,కృషితో విత్తనశుద్ది కర్మాగారాన్ని జిల్లా కు కేటాయించారని ఈ సందర్భంగా రైతుల పక్షాన ముఖ్యమంత్రికి, ఎమ్మెల్సీ కవిత కు,వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్,ఎంపీటీసీ సునీత లక్ష్మణ్,ఆత్మ ఛైర్మెన్ ఏలేటి రాజిరెడ్డి, AMC డైరెక్టర్ రాజిరెడ్డి,నాయకులు సతిరెడ్డి,జనార్దన్, శ్యామ్,తదితరులు పాల్గొన్నారు.