కెసిఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి లబ్ది-ఎమ్మెల్యే సంజయ్

కెసిఆర్ ప్రభుత్వంలో ఆలయంలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం రాయికల్ పట్టణంలోని పద్మశాలి సంఘ భవనంలో 67 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన ₹ 67,07,772 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

అనంతరం తాట్లవాయి లోని శ్రీ సీతా రామాలయం జాతర కార్యక్రమానికి హాజరై స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మేల్యే ను ఆలయ అర్చకులు సత్కరించి,తీర్ట ప్రసాదాలు అందజేశారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ సీతారాముల వారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని,ప్రజలు సుఖ శాంతులతో సుభిక్షంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో రాయికల్ మండల ప్రజా ప్రతినిదులు, సర్పంచులు, ఎంపీటీసి లు,ఉప సర్పంచ్ లు,వివిధ హోదాల్లో ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.


విద్యార్థుల వీడ్కోలు హంగామా !


జిల్లా కేంద్రంలోని జ్యోతి హై స్కూల్, ఐఐటి అకాడమి కి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు, పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని స్థానిక ఎల్జీ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు., ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అదేవిధంగా కరోనా పరిస్థితులలో విద్యార్థుల మానసిక స్థితిపై చేసిన నాటక ప్రదర్శనలు మరియు బ్రతుకుదెరువు కోసం కుటుంబాన్ని వదిలి విదేశాలకు వెళ్తున్న కుటుంబాల మనోభావాలను ప్రదర్శన రూపంలో చక్కగా విద్యార్థులు చేయడం తల్లి తండ్రులను చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. పదవ తరగతి విద్యార్థులు భవిష్యత్తులో పాఠశాల లోకాకుండా జిల్లా రాష్ట్రస్థాయిలో రాణిస్తామని చక్కని ఆట పాట ద్వారా సందేశం ఇచ్చారు అలాగే పదవ తరగతి విద్యార్థులు వారి అనుభవాలను వేదిక పైన పంచుకున్నారు.


ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్లు బియ్యాల హరిచరణ్ రావు, నిహారిక, బోయిని పెల్లి శ్రీధర్ రావు, రజిత, జువ్వాడి హరిచరణ్ రావు, మౌనిక, సుమన్ రావు పాల్గొన్నారు.


కొనసాగుతున్న చాలీసా పారాయణం!


పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో 40 రోజుల పాటు జరగనున్న హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు పారాయణం ప్రారంభించారు.