హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ప్రభుత్వం ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు

. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హిందూ ముస్లింలు సోదర భావంతో కలిసిమెలిసి ఉన్నారండి కొన్ని మతతత్వ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి అనారోగ్యం అయిందని, దానికి వైద్యం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

సీఎంతో పాటు హైదరాబాద్ ఎంపీ ఓవైసీ, మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తోఫా అందించారు.
