కోరుట్ల పట్టణంలో మంగళవారం భజరంగ్ దళ్,విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ ఘనంగా జరిగింది.స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయం నుండి బయలుదేరిన వీరహనుమాన్,ఛత్రపతి శివాజీతో ఉన్న భరత మాత విగ్రహాల శోభా యాత్ర కార్గిల్ చౌక్,నంది చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా, తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అంబేద్కర్ నగర్ మీదుగా ,గడి బురుజు గుండా తిరిగి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు కొనసాగింది. హనుమాన్ స్వాములు,హిందువులు భారీ కాషాయం జెండాలను పట్టుకొని జైశ్రీరామ్..జై హనుమాన్ నినాదాలతో హోరెత్తించారు.

పట్టణమంతా తోరణాలు, కాషాయ జెండాలతో కోరుట్ల పట్టణం కాషాయ మయమయింది . పార్టీలకతీతంగా హిందువులంతా వీర హనుమాన్ విజయ యాత్రను పాల్గొన్నారు
భారీ బందోబస్తు!
ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సీఐ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో ఎస్ఐలు సతీష్ కుమార్,శ్యాంరాజ్, సుధీర్ రావులు, బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భజరంగ్ దళ్ , విహెచ్ పి , రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొన్నారు.