జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం. కోనాపూరు, పెంబట్ల, అర్పపల్లి, ధర్మనాయక్ తాండా, లక్ష్మి దేవి పల్లి, నాయకపుగుడెం, బట్టపలి,పోతారం, రెచపల్లి,.మ్యాదరం తాండా, లచ్చ నాయక్ తాండా, రంగ పెట్,.నాగు నుర్,లచ్చాక్క పెట్ గ్రామాల్లో శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, 27 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 8 లక్షల 75 వేల విలువగల చెక్కులను అందించారు.

మరియు 37 మంది లబ్ధిదారులకు కు రూ. 37,04,297 విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ,చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత , ఎంపీపీ కోల జమునశ్రీనివాస్, జడ్పిటిసి మనోహర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు.!
జగిత్యాల పట్టణ టి ఆర్ నగర్ లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చాంద్ పాషా,. పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, నాయకులు భోగ ప్రవీణ్, యం ఏ అరిఫ్, కృష్ణ మూర్తి, శ్రీనివాస్, సుమన్, బాబా, కౌన్సిలర్ అల్లే గంగసాగర్, తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం ధర్మ నాయక్ తండా లో పాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేష్ . ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోలజమున శ్రీనివాస్, జడ్పిటిసి మనోహర్ రెడ్డి, పాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి, సర్పంచ్ లు సంతోష్ , రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్ పాక్స్ వైస్ చైర్మన్ బాపిరాజు, రైతు బంధు నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రూరల్ మండలం చల్గల్, వ్యవసాయ మార్కెట్ కమిటీలో PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లా జడ్పీ చైర్మన్ దావ వసంతసురేష్ అనంతరం రూరల్ ఎంపీపీ గాజర్ల గంగారం , ప్రథమ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు, పాక్స్ చైర్మన్ మైపాల్ రెడ్డి ,సర్పంచ్ ఎల్ల గంగనార్షు రాజన్న, వైస్ చైర్మన్ శీలం సురేందర్, రైతు సమన్వయ సమితి మెంబర్ దామోదర్ రావు ,నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు .