పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29వ తేదీన ఎల్.బి.స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సంబంధిత శాఖల అధికారులతో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన ఆదివారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ఇచ్చే ఇఫ్తార్ విందుకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ప్రముఖులు, హాజరవుతారన్నారు.

.అతిథులకు ఆహ్వాన పత్రికలు, సకాలంలో అందేలా చూడాలని, క్రమశిక్షణతో స్వాగతం పలికి, మర్యాదగా వ్యవహరించాలని అధికారులకు పలు సూచనలు చేశారు..ఎటువంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలని, ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు,చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను మంత్రులు ఆదేశించారు. వేదికను అందంగా అలంకరించాలని, ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తో తనిఖీ చేయించాలని, ఏ మాత్రం కొరత రానివ్వకుండా అందరికీ అందేలా చూడాలని ఆదేశించారు.
ఏర్పాట్లకు సంబంధించిన రూట్ మ్యాపును, మంత్రులు పరిశీలించి, స్టేడియం లో కలియ తిరిగి పర్యవేక్షించారు.
ట్రాఫిక్ జామ్ కావొద్దు, విద్యుత్తు సరఫరాకు ఆటంకం రానివ్వొద్దు
విద్యుత్తు, తాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం

ఎల్.బి.స్టేడియంలో జరిగిన ఈ సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింధర్ కుమార్,. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎం.డి.కాంతి వెస్లీ, Wakf Board మాజీ ఛైర్మన్ మహ్మద్ సలీం, కార్పోరేటర్ బాబా ఫసీయోద్దీన్, హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పోలీసు అధికారులు రంగనాథ్, రమేష్ చంద్ర, ప్రకాష్ రెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు