ఘనంగా అడ్లూరి జన్మదిన వేడుకలు !!

ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ,జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం నంది చౌక్ వద్ద కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్, నాయకులు సింహ రాజు ప్రసాద్ , వేముల రాజేష్ ,అప్పని తిరుపతి, సిపతి సత్యనారాయణ,రఫీ కుంట సుధాకర్, అయ్యోరి మహేష్, చిలుముల లక్ష్మణ్, మల్లేష్ తదితర నాయకులు పాల్గొన్నారు .పెగడపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అడ్లూరి, లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బుర్ర రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శులు విజయ భాస్కర్ ,మండల ఉపాధ్యక్షులు సంధి మల్లారెడ్డి, తడగొండ రాజు, కిసాన్ సెల్ అధ్యక్షులు పటేల్ సత్యనారాయణ రెడ్డి , ఇ బీసీ సెల్ . అధ్యక్షులు లింగాపూర్ ఎంపిటిసి పూసల శోభ తిరుపతి ,ఎంపీటీసీ ,కడారి సుప్రియ తిరుపతి, సింగిల్ విండో డైరెక్టర్ తోట మల్లేశం, ఎస్సీ సెల్ అధ్యక్షులు చాట్ల ప్రశాంత్, సీనియర్ నాయకులు ఆరికట్ల సంజీవ్ రేవంత్, జితేందర్ గౌడ్ చెట్ల, రాజేశం సుంకర రవి, శ్రీకాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

రాస్తారోకో…
జోగులాంబ గద్వాల్ జిల్లా లోని కేటి దొడ్డి మండలం ఇరక్కూచెడు గ్రామం లో అంబేద్కర్ విగ్రహం పై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ధర్మపురి పట్టణంలో శుక్రవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారి NH 63 పై బైఠాయించి, రాస్తారోకో చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి దుండగులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్టిబాబు ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర నాయకుడు పారేపల్లి రాజ మల్లయ్య కౌన్సిలర్ తరాల కార్తీక్ నాయకులు దుర్గం రవీందర్ చిలుముల లక్ష్మణ్ లచ్చన్న, దేవి అంజలి, పులి గంగ పోసు ఎం. దుబ్బయ్య తదితర నాయకులు నాయకులు పాల్గొన్నారు.


తహసిల్దార్ కు వినతి పత్రం !
బిజెపి పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు శుక్రవారం బీజేపీ శ్రేణులు ధర్మపురి లో. ఆందోళన చేపట్టి. స్థానిక తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు.

రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ను ఇస్తానని హామీ ఇచ్చి కనీసం 9 00 గంటలు కూడా రైతులకు విద్యుత్ సరఫరా చేయడం లేదని, పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది వినతి పత్రంలో పేర్కొన్నారు. కెసిఆర్ రైతులకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు, ఏకకాలంలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ మంజూరు చేయలేదు, ఉచిత ఎరువుల పంపిణి చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. తదితర ఆరోపణలను వినతి పత్రంలో పేర్కొన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో బిజెపి మండల ,పట్టణ అధ్యక్షులు సంగెపు గంగారం. బెజ్జారపు లవన్ . జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్. కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బండారి లక్ష్మణ్.Mptc ఆకు బత్తిని తిరుపతి. నాయకులు,కడారి గంగాధర్. కొల రాములు. ఆకుల శ్రీనివాస్. కస్తూరి మురళీ. పల్లెర్ల సురేందర్. సంగి మాధవ్. ఆనం దాసు నవీన్. అప్పం శ్రీనివాస్. తోట శ్రీనివాస్. కా శెట్టి హరీష్. ch శ్రవణ్. బొల్లారం లక్ష్మణ్. వీర వేణి నరసింహులు. తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement