మహిళా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు !!

      తెలంగాణ రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టుల ప్రత్యేక శిక్షణా తరగతులు ఏప్రిల్ మాసంలో హైదరాబాదులో నిర్వహించనున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ  సోమవారం ప్రకటనలో తెలిపారు. రెండు రోజులపాటు జరిగే శిక్షణా తరగతులలో పాల్గొనదలచినవారు  తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.  హైదరాబాదులోని మహిళా జర్నలిస్టులు మీడియా అకాడమి మేనేజర్ శ్రీమతి ఏ,వనజ (సెల్ నె.7702526489)ను  మరియు జిల్లాలలో పనిచేసేవారు ఆయా జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయాలలో నమోదు చేసుకోవాలని అన్నారు.  మొదటిరోజు రాష్ట్ర మహిళా మంత్రులు, యంపిలు, ఎమ్మెల్సీలు శాసనసభ్యులు ఈ శిక్షణా తరగాతుల్లో  ప్రసంగిస్తారని ఆయన వివరించారు. రెండవ రోజు జాతీయ స్తాయిలో నిష్ణాతులైన మహిళా జర్నలిస్టులు  ప్రసంగిస్తారు.
మొదటి రోజు న “మహిళా జర్నలిస్టులు –  ప్రధాన స్రవంతి మీడియా – మహిళల పాత్ర” అనే అంశంపై మరియు “ పాత్రికేయ రంగంలో మహిళలు – ప్రత్యేక సమస్యలు” అనే అంశంపై  ప్రసంగాలు వుంటాయి.  రెండవ రోజు  “మహిళా అస్తిత్వం – జెన్డర్ సెన్సీటైజేషన్ “ అనే అంశం,  “ఫీచర్ జర్నలిజం –  మెళకువలు”  అంశాలపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నిష్ణాతులైన  వారి ప్రసంగాలు వుంటాయి. చైర్మన్ అల్లం నారాయణ ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు


జర్నలిస్టుల ఇండ్ల కు శంకుస్థాపన !!


జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ లో ఇళ్ల నిర్మాణం కు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సోమవారం శంకుస్థాపన చేశారు. కొనరావుపేట రోడ్డులో  విలేఖరులకు  మొదటి విడత 15  జర్నలిస్టులకు. డబుల్ బెడ్ రూమ్   ఇల్లు స్థలం మంజూరు చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొద్ది రోజుల వ్యవధిలోనే మరో 15 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు శేఖర్ ఎమ్మెల్యేకు జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం తప్ప జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ కుమార్ బండ స్వామి, జాతీయ కౌన్సిల్ సభ్యుడు మహమ్మద్ ఇమ్రాన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జి శ్రీనివాసరావు గూడెం మల్లారెడ్డి , జర్నలిస్టులు  హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.  ఇదే  విధంగా  జిల్లాలో అంతటా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్  శ్రీమతి అన్నం లావణ్య అనీల్, ,వైస్ చైర్మన్ గడ్డమీది పవన్ ,.జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య రాజేష్ , వైస్ ఎంపీపీ చీటీ స్వరూప వెంకట్రావు, సిఐ రాజశేఖర్ రాజు ,విద్యుత్ ఏ ఈ అమరెందర్ ,పంచాయతీ రాజ్ డి ఈ గోపాల్,ఏ ఈ రాజు ,ఆదిత్య,   తదితరులు పాల్గొన్నారు..

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ !

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

జనగామ జిల్లా నర్మెట ఎస్ఐ రవికుమార్ సోమవారం
ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా . పట్టుబడ్డాడు. ఓ కేసు వివాదంలో   25 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు పక్కా స్కెచ్ వేసి అధికారులు పట్టుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.