మన ఊరు మన బడి కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయండి – కలెక్టర్

జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమమును పకడ్బందీగా నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారులను ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.మన ఊరు మన బడి కార్యక్రమ నిర్వహణ, ఇతర పలు అంశం పై శనివారం ఇంజినీరింగ్ అధికారులు , మండల ప్రత్యేక అధికారులు, విద్యాశాఖ అధికారి తో కలిసి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన 12 మౌలిక వసతులు కల్పిస్తూ ప్రైవేటుకు ధీటుగా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని రూపొందించారని ఆయన తెలిపారు.వేగంగా ప్రతిపాదనలు తయారు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
జ్యోతిబాపూలే జయంతిని విజయవంతం చేయండి
భారతదేశ తోలిసామాజిక తత్వవేత్త, మేధావి, ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త, సంఘసేవకుడు, “శ్రీ జ్యోతిరావు గోవిందారావు పూలే” గారి 196వ జయంతి కార్యక్రమం ఏప్రిల్ 11 సోమవారం రోజున ఉదయం గం.9.30 ని||  జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో  నిర్వహించనున్నట్లు  జిల్లా కలెక్టర్  ప్రకటనలో తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి జగిత్యాల జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, బడుగు, బలహీన వర్గాల వారు, వెనకబడిన తరగతుల వారు, బీసి సంక్షేమ సంఘ నాయకులు కార్యకర్తలు, బీసి యువజన సంఘం నాయకులు కార్యకర్తలు, బిసి విద్యార్థి సంఘ నాయకులు కార్యకర్తలు మరియూ బీసి కుల భాందవులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రకటనలో కోరారు.


నిజాయితీ చాటుకున్న జర్నలిస్ట్!


జగిత్యాల ఆంధ్రజ్యోతి రూరల్ రిపోర్టర్ నీరటి గంగాధర్ తన నిజాయితీ చాటుకున్నారు. జిల్లా కేంద్రం లోని గణేష్ భవన్ హోటల్ లో  టీ త్రాగడం కోసం వెళ్ళినపుడు ఓ టేబుల్ పై 10 వేల నగదు దొరికాయి.  తనకు దొరికిన డబ్బును తీసుకొని  పోలీస్ స్టేషన్ కు వెళ్లి పట్టణ సీఐ కిషోర్ కు అందించాడు.  తన మానవత్వాన్ని . నిజాయితీ చాటుకున్న గంగాధర్ ను పట్టణ సీఐ , పోలీసు వర్గాలు పట్టణ ప్రజలు నెటిజన్లు అభినందించారు. జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ కుమార్ బండ స్వామి, ఐజేయూ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్  రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు గూడ మల్లా రెడ్డి ఇ కార్యవర్గ సభ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా బాధ్యుడు టీవీ సూర్యం, తదితర జర్నలిస్టులు వివిధ దిన పత్రికల స్టాఫ్ రిపోర్టర్లు  హర్షం వ్యక్తం చేస్తూ జర్నలిస్టు గంగాధర్ అభినందించారు.


మానవత్వం ..


జగిత్యాల పట్టణంలో తులసినగర్ వద్ద ఓ వానరం విద్యుత్ స్తంభం పైకి ఎక్కగా ప్రమాదవశాత్తు విద్యుతాఘాతానికి గురై కింద పడింది.

ఆ సమయంలో అక్కడే ఉన్న బి సీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, వృత్తిరీత్యా ఆర్ఎంపి ఆకుల నాగరాజు వెంటనే వానారనికి ప్రాథమిక చికిత్స అందించు వానరం ప్రాణాలు కాపాడారు.
కోలుకున్న వానరం అక్కడి నుండి పారిపోయింది. మానవత్వం చాటుకున్న నాగరాజును పలువురు అభినందించారు…