మంగలి గడ్డ కు మహర్దశ- 5 కోట్ల నిధులతో సుందరీకరణ మంత్రి ఈశ్వర్ !


ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి గోదావరి నది తీరాన గల మంగలి గడ్డను. ఐదు కోట్ల నిధులతో సుందరీకరణ పనులు చేపట్టనున్నట్టు మంత్రి ఈశ్వర్ అన్నారు. ( మంగళ్ ఘాట్.) సుందరీకరణ లో భాగంగా ఎంట్రీ గేట్, ఫౌంటేయిన్లు, చిల్డ్రన్ ప్లే ఏరియా, వాచ్ టవర్, శిల్పాలు, హార్టిస్టిక్ బెంచీలు, గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టనున్నట్టు మంత్రి వివరించారు.


ధర్మపురి, జగిత్యాల, పట్టణాలను మరింత అభివృద్ధి చేసే, సుందరీకరించే పనులు త్వరలో మొదలు పెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పరిశీలించారు.

అదేవిధంగా పట్టణంలోని చింతామణి, తమ్మళ్లకుంట చెరువు, పరిసరాలను, వల్లభాయ్ పటేల్, గాంధీ జంక్షన్లను ₹ 2కోట్ల20లక్షలతో మరింత సుందరీకరణ చేస్తామన్నారు.. అలాగే, జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండు, పాత బస్టాండు, జయశంకర్ విగ్రహం చౌరస్తాలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. .

ఈ ప్రతిపాదిత పనులకు సంబంధించి ముంబాయికి చెందిన డి.ఎ.ల్యాండ్ స్కేపింగ్ సంస్థ .రూపకల్పన చేసిన ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ ను నిశితంగా పరిశీలించిన మంత్రి వారికి పలు సూచనలు ,సలహాలిచ్చారు. త్వరలో ధర్మపురి, జగిత్యాలలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఈ పనులకు తుది రూపం ఇవ్వనున్నట్టు మంత్రి క్యాంపు కార్యాలయంలో నుంచి ప్రకటనలో వివరించారు.

జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్

హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ) ఆధ్వర్యంలో శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అబిడ్స్ లోని మీడియా ప్లస్ లో జరిగిన కార్యక్రమంలో ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం. ఏ.మాజీద్ ,

హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగ శంకర్, .స్మాల్ అండ్ మీడియా పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు, హాబీబ్ జిలానీ, తెహార్ రుమాని, కలీల్ ఖాద్రి, స్వామి దేశపాక, .హాబీబ్, సీనియర్ జర్నలిస్టులు ఫాజిల్ హుస్సేన్ , ఫర్వేజ్ , హష్మి, ఫసి అహ్మద్,.మల్లికార్జున్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారులు