జగిత్యాల జిల్లా ధర్మపురి కేంద్రంలో 30 లక్షల తో నూతనంగా నిర్మించిన షాదిఖానా ను మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ప్రారంభించారు.. అనంతరం , రంజాన్ పర్వదినాన్ని పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిరుపేద ముస్లిం సోదరులకు గిఫ్ట్ ప్యాక్ పంపిణీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నియోజకవర్గం స్థాయి, ముస్లిం సోదరులకు ఇచ్చిన దావత్ ఏ ఇఫ్తార్ విందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ

తెలంగాణ, మత సామరస్యానికి పెట్టింది పేరని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ధర్మాలను సమదృష్టితో చూస్తున్నారన్నారు. రంజాన్ పండుగను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. మసీదులు, ఈద్గాల అభివృద్దికి, మరమ్మతులకు నిధులిస్తున్నామన్నారు. పేద ముస్లింలకు,దుస్తుల పంపిణీతోపాటు, ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.

పవిత్ర రంజాన్ మాసం మహోన్నతమైనదని పేర్కొన్నారు. ముస్లీం సోదరులు తమ నిత్య ప్రార్థనల లో మత సమైక్యతతో పాటు, దేశ సమగ్ర అభివృద్ధి కై భగవంతున్ని ప్రార్థించాలని అని మంత్రి విజ్ఞప్తి చేశారు.
కటినమైన ఉపవాస దీక్షల ద్వారా వ్యక్తి గత క్రమశిక్షణ అలవడుతుందన్నారు.
అల్లా ఆశీస్సులు ప్రతీ ఒకరి పై ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి అన్నారు. రాష్ట్రం లో అన్ని మతాలకు అనుగుణంగా, సందర్భాన్ని బట్టి, ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించడం అనేది దేశం లొ తెలంగాణ రాష్ట్రం లొ మినహా మరెక్కడా లేదన్నారు.
రంజాన్ పండుగలో ప్రభుత్వ భాగస్వామ్యం, ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా, ప్రభుత్వ ఇఫ్తార్ విందులు ఘనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇఫ్తార్ విందు కు వచ్చిన ప్రతీ ముస్లీం సోదరుడి కి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్, బత్తిని అరుణ , ఎంపీపీ చిట్టిబాబు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయ్యో రాజేష్ జిల్లా కో ఆప్షన్ సభ్యులు, మండల కో ఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ శ్రేణులు నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవాలు !

మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం గోదావరిఖని l
ఇందిరనగర్ లోని వీరుపాక్షి ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంక్) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ అనిల్ , డిప్యూటి మేయర్ అభిషేక్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

గోదావరిఖని లక్ష్మీ నగర్ లో ని జయశ్రీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ని ప్రారంభించిన మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటిలో!

ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు జగిత్యాల మాజీ మున్సిపల్ చేర్మెన్ గిరి నాగభూషణం తన ఇంటి లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల MLC జీవన్ రెడ్డి , పాల్గొన్నారు. జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరిని కలిసి రంజాన్ మాసంకు ఉన్న ప్రత్యేకత గురించి వివరించారు. భారత దేశంలో అన్ని మతాలు సమానమని, గంగ, యమున, సరస్వతి నదులు ఎలా కలిసి ఉన్నాయో అదే విదంగా మనమందరం కలసిమెలసి ఉండాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో ముస్లిం పెద్దలు,సోదరులు,మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
