మథుర లో IJU కార్యవర్గ సమావేశాలు ప్రారంభం !


ఉత్తర ప్రదేశ్ లోని మథురలో 25 ,26 తేదీలలో జరుగుతున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU E.C) కార్యవర్గ సమావేశాలు అత్యంత ఉత్సాహ పూరిత వాతావరణంలో ప్రారంభమైయ్యాయి. సమావేశాలకి ఐజేయి అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి అద్యక్షత వహించారు
ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రెస్ కౌన్సిల్ ఆప్ ఇండియాను మీడియా కౌన్సిల్ గా మార్చాలనే మన డిమాండ్ ను అంగీకరించటానికి  కేంద్రప్రభుత్వం సిద్ధంగా లేవకపోవడం విచారకరమన్నారు.

అంతేకాకుండా మీడియా మీద మరిన్ని ఆంక్షలు పెట్టేందుకు సిద్ధపడటం దుర్మార్గమని మండిపడ్డారు. మీడియా ప్రతినిధులకు ఇచ్చే అక్రిడేషన్ల విషయంలో కూడ పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానలపై ఉద్యమించాల్సి ఉందని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ బల్వంధర్ జమ్మూ మాట్లాడుతూ, మన యూనియన్ వివిద రాష్ట్రాల్లో చేపట్టిన కార్యకలాపాలను వివరించారు.  యూనియన్ లోకి కొత్తగా వచ్చిన మహరాష్ట్ర , హర్యానా రాష్ట్రాల నాయకులను అభినందించారు.


సమావేశంలో ఐజేయి మాజీ అధ్యక్షులు ఎపి ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్,  మరో మాజీ అధ్యక్షులు యస్ ఎన్ సిన్హా ,.ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు,  ఐజేయూ కార్యదర్శి  వై నరేందర్ రెడ్డి , ఉత్తరప్రదేశ్ ‘ శ్రమజీవి పత్రికార్ సంఘం’ అధ్యక్ష కార్యదర్శులు రాజీవ్ త్రివేది , పాండే, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన దాసరి కృష్ణారెడ్డి , ఆలపాటి సురేశ్ కుమార్, డి.సోమసుందర్, నగునూరి శేఖర్, విరహత్ అలీ, ఐ వి సుబ్బారావు , కె.రాంనారాయణ , నల్లి ధర్మారావు లు మహారాష్ట్ర నుంచి గూడూరి శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.