మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి ఎస్పీ సింధుశర్మ !

కార్పోరేట్ స్థాయి ఆసుపత్రులలో లభించే అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన మెడికల్ క్యాంపును ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల్ ఎస్ పి సింధు శర్మ అన్నారు. శుక్రవారం బుగ్గారం మండలం కేంద్రంలో ZPHS పాఠశాలలో ఎల్.ఎమ్ కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ మరియు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సయుక్తంగా నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులో విశిష్ట అతిధిగా జిల్లా SP సింధూశర్మ పాల్గొన్నారు.


ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ
ఎల్.ఎమ్ కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ మరియు ప్రతిమ ఫౌడేషన్ ల ఆధ్వర్యంలో జిల్లాలో గ్రామీణ పేద ప్రజలకు ఈ క్యాంపు చాలా ఉపయోగకరం, కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని గ్రామంలో అందించడం చాలా అభినందనియం, హెల్త్ క్యాంపు అనగానే కొంతమంది సిబ్బంది మందులతో కాకుండా, కార్పోరేట్ ఆసుపత్రులలో మాత్రమే లభించే వైద్య పరీక్షల కొరకు ఉపయోగించే పరికరాలను ఒక బస్సు ద్వారా వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడం మాత్రమే కాకుండా, ప్రతి విభాగానికి చెందిన నిశ్నాతులై వైద్యులు, వైద్య శిబ్బందితో గ్రామస్థాయి ప్రజలకు అందుబాటులో వైద్య శిభిరాన్ని నిర్వహిచేలా కృషిచేస్తున్న ప్రతిమ మరియు ఎల్. ఎమ్ కొప్పుల ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

గతంలో ధర్మపురి మండలం నక్కల పేట గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది SP గుర్తుచేసారు పరీక్షల ఆదారంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కోన్నారు. ప్రతిఒక్కరు ఆర్థిక ఇబ్బందులు, పనిఒత్తిడితో వ్యాదులను నిర్లక్యం చేయకూడదని, గ్రామంలో ప్రతిఒక్కరికి సేవలు అందించేలా, గ్రామస్థాయిలో మరిన్ని సేవలును అందించాలని పేర్కొన్నారు.


ప్రతిమ హస్సిటల్ కరీంనగర్ CAO బల్మురి రాంచందర్ రావు మాట్లాడుతూ
ఇప్పటి వరకు ప్రతిమ ఆసుపత్రి ద్వార గ్రామీణ ప్రాంత ప్రజల కు ఉచిత వైద్య సేవలు అందించాలని ఉద్దేశ్యం తో ఇలాంటి వైద్య క్యాంపులు నిర్వహిస్తున్నారు..
ఎల్.ఎమ్ కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ తో కలిసి చాలా ఆనందంగా ఉంది, ఈరోజు నిర్దారణ అయినటువంటి రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు ఉచితంగా చేస్తామని తెలుపారు

ఎల్ ఎమ్ కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ శ్రీమతి కొప్పుల స్నేహలత ఈశ్వర్ మాట్లాడుతూ,


గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వారి పనిచేస్తేనే బ్రతకగలమని పనిచేసుకుంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదనే సంకల్పంతో ప్రతిమ పౌడేషన్ వారి సహకారంతో హెల్త్ క్యాంపును నిర్వహించడం జరిగిందని అన్నారు. హెల్త్ క్యాంపు ద్వారా అవసరమైన పరీక్షలను నిర్వహించి, మందులను అందించేలా హెల్త్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోని ఆరోగ్య వంతులుగా ఉండాలని స్నేహలత గారు పేర్కొన్నారు. ఈ క్యాంపు ద్వారా ముందూగానే గుర్తించి చికిత్సను అందించడం జరుగుతుందని, రవాణ, ఆర్థిక భారంతో, వైద్య చికిత్సకు దూరమైన వారి కొరకు ప్రతిమ, ఎల్.ఎమ్ కొప్పుల మరియు ఇతర స్వచ్చంద సంస్థల సహకారంతో మారుమూల ప్రాంతాలలో సేవలను అందించడం జరుగుతుందని పేర్కోన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ద్వారా అత్యాదునికి సదుపాయాలతో ఎకో, న్యానొతెరపి, ఈసిజి మరియు మిని లాబోలేటరి సదుపాయాలు కలిగిన, సుమారు 5కోట్ల విలువైన మోబైల్ హెల్త్ హస్సిటల్ వాహనాన్ని హెల్త్ క్యాంపు కొరకు తీసుకుని రావడం జరిగిందని. దేశ ఆహర భధ్రతకు, ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నులా నిలిచిన రైతుల ఉన్న గ్రామపంచాయితీలలో, స్వావలంబన, స్వపరిపాలనకు నిదర్శనమైన గ్రామపంచాయితీలు పూర్తి ఆరోగ్యవంతంగా వుండేలా కార్యాక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో హెల్త్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
యువత మత్తు మందులు, మధ్యపానం, గంజాయి అలవాటుతో తల్లి దండ్రులకు పుత్రసోకం మిగిలిస్తున్నారు.
ఎల్.ఎమ్ కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ మరియు ప్రతిమ ఆసుపత్రి ద్వారా నిర్వహించిన ఉచితం వైద్య మరియు వ్యాధి నిర్ధారణ శిబిరంనందు ఓపి లు 636 మంది హాజరు కాగ, ఇందులో 180మంది రోగులకు వైద్యులు పరీక్షించి, వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. మరియు 42 మంది రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సూచించారు.


ఈ కార్యక్రమంలో ధర్మపురి వైద్యాధికారి నీలారపు శ్రీనివాస్, సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్, యంపిపి శ్రీమతి బాదినేని రాజమణి రాజేంధర్, వైస్ యంపిపి సుఛింధర్ గారు, మండలం పార్టీ అధ్యక్షులు మహేష్ గారు, కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షులు జాడీ శ్రీనివాస్ గారు, ఎల్.ఎమ్ కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ సభ్యులు నూతి మల్లయ్య, మామిడాల రవింధర్ ,మండల కోఆప్షన్ సభ్యులు రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్ప సన్నిధిలో మంత్రి ఈశ్వర్,


మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం కేరళలోని శబరిమలై అయ్యప్పస్వామి దర్శించుకున్నారు. మంత్రితో పాటు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,మాజీ స్పీకర్ , ఎమ్మెల్సీ మధుసూదన్ చారి , మేడారం సింగిల్విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి బుగ్గారం జెడ్పిటిసి సభ్యుడు,బాదినేని రాజేధర్ , మాజీ మార్కెట్ ఛైర్మన్ ఏలేటి క్రిష్ణారెడ్డి లు ఉన్నారు.