మీ చేయూత అభినందనీయం-మంత్రి ఈశ్వర్ !

ఎస్సీ గురుకుల మహిళా కళాశాల భవన నిర్మాణానికి రూ 17 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా హైదరాబాద్ జగద్గిరిగుట్ట లోని గురుకుల పాఠశాల, కాలేజి భవనానికి (H.A.L) సంస్థ
హెచ్ఎఎల్ అధికారులు నగరంలో శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని కలిసి తమ అంగీకార పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మంత్రి, ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, లు సంతోషం వ్యక్తం చేస్తూ హెచ్ఎఎల్ అధికారులను అభినందించారు, శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారు. మొత్తం 1,000 గురుకులాలలో సుమారు 6 లక్షల మందికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని ఉచితంగా అందిస్తున్నం అన్నారు.
అమ్మాయిలు తమ చదువులను మధ్యలోనే ఆపేయకుండా నిరాఘాటంగా కొనసాగించేందుకు గాను వారి కోసం ప్రత్యేకంగా 30డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. ఇందులో భాగంగా కొనసాగుతున్న జగద్గిరిగుట్ట పాఠశాల, కాలేజీకి శాశ్వత భవనాన్ని సమకూర్చేందుకు గాను కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హెచ్ఎఎల్ ముందుకు వచ్చి 17కోట్లు మంజూరు చేయడం సంతోషదాయకం. ఈ విధంగా మరిన్ని సంస్థలు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది – హెచ్ఎఎల్ అధికారుల సేవా భావాన్ని మంత్రి కొప్పులఈశ్వర్, కార్యదర్శి రోనాల్డ్ రాస్ లు అభినందిస్తూ జనరల్ మేనేజర్ అరుణ్ సర్కాటేను శాలువతో సత్కరించారు.

కార్యక్రమంలో పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధుకర్, హెచ్ఎఎల్ జనరల్ మేనేజర్ అరుణ్ సర్కాటే, అధికారులు రాంకిశోర్, సురేందర్ జీ,జతీందర్ పాల్ కౌర్,ప్రహ్లాద్, గురుకుల విద్యా సంస్థల సొసైటీ అధికారులు హన్మంతు నాయక్, మామిడాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు


అంబేడ్కర్ జయంతి పోస్టరును ఆవిష్కరించిన మంత్రి


భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా రూపొందించిన పోస్టరును షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఆవిష్కరించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల కమిటీ ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతిని ట్యాంక్ బండ్ సమీపాన ఉన్న వారి విగ్రహం వద్ద ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా కమిటీ రూపొందించిన పోస్టరును మంత్రి శనివారం హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో కమిటీ వర్కింగ్ ఛైర్మన్లు రావుల విజయ్ కుమార్, నాగారం బాబు మాదిగ, వైస్ ఛైర్మన్ ఏర్పుల యాదయ్య, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, నాయకుడు మేడి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.


డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ !


జగిత్యాల మండలం తక్కలపెల్లి గ్రామంలో శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని . ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ దా వసంత సురేష్, ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్,ఎంపీపీ రాజేంద్రప్రసాద్, పాక్స్ చైర్మన్ సందీప్ రావు, దళిత సంఘం నాయకుడు బాలే శంకర్ , మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం, సర్పంచ్లు జైపాల్ రెడ్డి,తిరుపతి,నారాయణ,ఎంపీటీసీలు సురేందర్ రెడ్డి, పరుశురాం గౌడ్, ఉప సర్పంచ్ విక్రం,టీఆర్ఎస్ మండల,పట్టణ నాయకులు,అంబేద్కర్ సంఘం నాయకులు, మాల మహానాడు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.