మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఈశ్వర్

ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామానికి చెందిన మారంపల్లి శరత్, పబ్బతి నవదీప్ లు కుటుంబాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పరామర్శించి ఓదార్చారు. చెరువుకు ఈత కు వెల్లి, ప్రమాదవశాత్తు ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆర్థిక సహాయం !
ధర్మపురి మండలంలోని రామయ్యపల్లే గ్రామానికి చెందిన
నిరుపేద కుటుంబానికి చెందిన కీ.శే. మసీదు పోషన్న -లక్ష్మీ
రామయ్యపల్లె గార్ల ఏకైక పుత్రిక మసీదు స్వప్న గారి వివాహ కార్యక్రమానికి హాజరై వదు వరులను ఆశీర్వదించి 5000 ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన జగిత్యాల డీసీసీ అధ్యక్షులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘనబట్ల దినేష్, చిలుముల లక్ష్మణ్, సుధాకర్ రెడ్డి,కలమడుగు ఇందయ్య, వినోద్,గణేష్ విజయ్, అరుణ్ తదితరులు లక్ష్మణ్ కుమార్ వెంట ఉన్నారు.

జన్మదిన వేడుకలు !

జేఏసి,టీఎన్జీవో,టీ రెవెన్యూ ఉద్యోగుల,టీ పెన్షనర్స్,టీ సీనియర్ సిటిజెన్స్ ,టీబీసీ జేఏసి సంఘాల ఆధ్వర్యంలో పలు సంఘాల గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రం లోని బండారి విజయ్ భవన్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా 16 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు,ఆర్థిక సహాయం అందజేశారు..ఈ కార్యక్రమంలో టీ ఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్,ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎం.డీ వకీల్, రిటైర్డు జాయింట్ కలక్టర్ కృష్ణా రెడ్డి, టీ ఎన్జీవో జిల్లా కార్యదర్శి నాగేందర్ రెడ్డి,టీ బీసీ జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మార్కెట్ డైరెక్టర్ బండారి విజయ్,పెగడపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమణా రెడ్డి,టీ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్, టీ సీనియర్ సిటిజెన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,సహాయ అధ్యక్షుడు రఘుపతి,పట్టణ అధ్యక్షుడు అలిశెట్టి ఈశ్వరయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు కూతురు రాజేష్,పిట్ట ధర్మ రాజు, పంబాల రాం కుమార్,బండారి నరేందర్,కూతురు శేకర్, ఆనంద రావు,టీ బీసీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కస్తూరి శ్రీ మoజరి, మున్నూరు కాపు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆరే దశరతం, జిల్లా కార్యదర్శి క్యాస రఘునందన్ రెడ్డి,సీనియర్ న్యాయవాదులు గోవిందుల రాజన్న, తాండ్ర సురేందర్, కట్కం చంద్ర మోహన్,పుప్పాల సత్యనారాయణ, బూస రాం చంద్రం, రవీందర్ గౌడ్, డాక్టర్లు ,వివిధఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక,పెన్షనర్ల ,సీనియర్ సిటిజన్స్,బీసీ, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

బీజేపీ జెండా ఆవిష్కరణ !

భారతీయ జనతా పార్టీని స్థాపించి నేటితో 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఎంపీ గారి పిలుపు మేరకు ధర్మపురి మండలం లోని వివిధ గ్రామాలలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సంగేపు గంగారాం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద పార్టీగా అవతరించింది ప్రతి సామాన్యుడి నమ్మకాన్ని బిజెపి పార్టీ చూరగొంటునది అన్నారు.ఈ కార్యక్రమం లో మండల ప్రధానకార్యదర్శి కోరుట్ల మల్లికార్జున్.గాజుల రామదాసు.సోగల కిషన్. అక్కినపెల్లి తిరుపతి. పాదం తిరుపతి. దొంతుల లక్ష్మణ్. దోంతుల సంతోష్. గూమ్ముల రాకేష్.డొల్ల భూమయ్య.కుక్కల సుదీర్.కట్ట చెంద్రశేకర్. అడేపు శ్రీనివాస్.అల్లే వంశీ.అడ్డగూరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన !

ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 38లక్షల 60 వేల తో 500 మెట్రిక్ గోదాంకు, సైడ్ నిర్మాణానికి శంకుస్థాపన, అనంతరం 10 లక్షల తో సి.సి రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు