ముగ్గురు నక్సలైట్ల అరెస్టు – ఆయుధాలు స్వాధీనం !

ముగ్గురు జనశక్తి మావోయిస్టు పార్టీ నక్సలైట్ నాయకులను అరెస్టు చేసి వారి నుంచి ఆయుధాలు, బుల్లెట్లు స్వాధీనపరుచుకున్నట్టు . జగిత్యాల ఎస్పి సింధుశర్మ శుక్రవారం సాయంత్రం పాత్రికేయుల సమావేశంలో తెలిపారు.
జనశక్తి మావోయిస్ట్ పార్టీని బలోపేతం చేసేందుకు యువకులను రిక్రూట్ మెంట్ చేసుకుంనేందుకు ప్రయత్నాలు చేస్తున్న జనశక్తి మావోయిస్టు పార్టీలోని ముగ్గురు నక్సలైట్లను కోరుట్ల పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారని అని ఆమె వివరించారు.

గురువారం సాయంత్రం జగిత్యాల జిల్లా కోనరావుపేట క్రాసింగ్ వద్ద, పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా పట్టుబడినట్లు.వీరి వద్దనుండి., నాలుగు తుపాకులు, మూడు తపంచాలు,299 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సింధు శర్మ వివరించారు.


పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచండి !
పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విదంగా పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్ పనిచేయాలి అని ఎస్ పి సింధు శర్మ పదోన్నతులు పొందిన 18 మంది కి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పరిధిలో కానిస్టేబుళ్లు గా విధులు నిర్వర్తిస్తూ హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతులు పొందిన 18 మంది కి హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి చిహ్నంను ఎస్పి అలంకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు, మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు. పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది మరియు అధికారులు పోలీసు శాఖలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు,గౌరవ మర్యాదలు లభిస్తాయని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి శ్రీ రూపేష్ ఐపీఎస్ , డిఎస్పీ ప్రకాష్ పాల్గొన్నారు.


ట్రాఫిక్ హోంగార్డు ను అభినందించిన చీఫ్ జస్టిస్ !!


అబిడ్స్ ట్రాఫిక్ పీఎస్ లో హోంగార్డుగా పనిచేస్తున్న అష్రఫ్ అలీకి ఊహించని అనుభవం, ఉదయం 8 గంటల సమయంలో అతడు విధులు నిర్వహించే రూట్ లో కారొచ్చి ఆగింది. ఇంతలోనే ఆ కారులోనుంచి నల్లకోటు వేసుకున్న వ్యక్తి దిగారు. కొద్ది దూరంలోనే విధుల్లో నిమగ్నమై ఉన్న అష్రఫ్ అలీని పిలిచారు. ఎవరై ఉంటారా అనుకుంటూ వెళ్లాడు.. ఇంతలోనే కారు డ్రైవర్ స్పందిస్తూ సార్ ఎవరో తెలుసా.. హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అనే సరికి హోంగార్డు కొంత ఆందోళన చెందాడు. ఇంతలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ శర్మ కల్పించుకొని హోంగార్డుకు పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. అష్రఫ్ అలీ పని విధానం, డ్యూటీ పట్ల నిబద్ధత తనకు ఎంతగానో నచ్చాయని, బాగా పనిచేస్తున్నారని ప్రశ్నించారు. చీఫ్ జస్టిస్ స్థాయి వ్యక్తి అభినందించడంతో ట్రాఫిక్ హోంగార్డ్ అష్రఫ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చీఫ్ జస్టిస్ స్థాయి వ్యక్తి హోంగార్డును అభినందించి, తన పనితీరును మెచ్చుకోవటం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు. అదేవిధంగా నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న అష్రఫ్ అలీని నెటిజర్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.