నిందితులను వెంటనే అరెస్టు చేయాలి !బిజెపి నాయకుల డిమాండ్

వేధింపులకు గురి చేసి తల్లీ కొడుకుల బలవన్మరణానికి కారకులైన తెరాస నాయకులను వెంటనే అరెస్టు చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.. మంగళవారం
మెదక్ జిల్లా రామాయంపేట లో తెరాస నాయకుల వేధింపులకు గురై, ఆత్మహత్య చేసుకున్న తల్లి కొడుకులు, తల్లి, గంగం పద్మ, కొడుకు గంగం సంతోష్, కుటుంబాన్ని వారు పరామర్శించారు.

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బిజెపిజాతీయ కార్యవర్గ సభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేంధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మరియు పలువురు బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ,
మూడు రోజులు దాటినా నింధితులను ఎందుకు అరెస్టు చేయలేదన్నారు..

మృతులు ఎలాంటి తప్పులు చేసిన దాఖలాలు లేవు అని, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లో వెంచర్లు వేసుకుంటూ ఫ్యామిలీ తో ఉంటున్నాడు. అని వివేక్ అన్నారు. వెంచర్లలో 50. శాతం వాటా కావాలని నిందితులు వేధించడం సిగ్గుచేటు అన్నారు. తప్పు చేసిన వారిని టీఆర్ఎస్ నాయకులు ప్రోత్సహిస్తున్నారు, నిందితులను వెంటనే అరెస్టు చేయకపోతే సిబిఐ ద్వారా ఎంక్వయిరీ చేయించడానికి పార్టీ పక్షాన కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని డాక్టర్ వివేక్ హెచ్చరించారు


బారసాల లో పాల్గొన్న వివేక్ !


జగిత్యాల జిల్లా ధర్మపురి లోని బిజేవైఎం మండల్ అధ్యక్షుడు గాజు భాస్కర్, కూతురూ నామకరణ బాలసాల కార్యక్రమానికి మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ హాజరయ్యారు. భాస్కర్ దంపతులను ,పాప ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మండల పట్టణ బీజేపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.. పిదప పెద్దపల్లి జిల్లా ధర్మారం లోని బొయవాడ కు చెందిన బొడిగె మల్లెషం ఇంటిలో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి ప్రమాద ఘటన స్థలాన్ని. వివేక్ పరిశీలించారు.