నిరసన దీక్షలు చేపట్టండి – టిఆర్ఎస్ క్యాడర్ కు మంత్రి కొప్పుల దిశ నిర్దేశం!

తెలంగాణలో పండిన వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4 నుంచి మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ టిఆర్ఎస్ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ క్యాంపు . కార్యాలయం నుంచి ఆదివారం ధర్మపురి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల తో టెలికాన్ఫరేన్స్ ను నిర్వహించారు..ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు కేంద్రం తెలంగాణలో పండిన వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా గ్రామ గ్రామాన తీర్మానం చేసి, ప్రధాన మంత్రి మోడీ గారికి తీర్మాణ పత్రాలను వారి అడ్రస్ కి పోస్టు చేసిన విషయం అందరి తెలుసు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు 7.వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు నిర్వహించి, 8.వ తేదీన నియోజకవర్గలో అన్ని గ్రామాల్లో, కేంద్రం వైఖరికి నిరసన ప్రదర్శనలు మరియు ప్రతి రైతు ఇంటిపై నల్లజండాలు ఎగరవేయడం, బైక్ ర్యాలీలు నిర్వహించి, ఎవరైతే బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులను, నిలదీయాలని మంత్రి తెరాస ప్రజాప్రతినిధుల కు దిశానిర్ధేశం చేసారు.


ఆర్ఎస్ఎస్ వట వృక్షం అయింది !!
1925 లో ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) నేడు ఓ పెద్ద వట వృక్షమై సమాజానికి బాసటగా నిలిచింది అని జగిత్యాల జిల్లా సంచాలక డాక్టర్ శంకర్ అన్నారు. ఆదివారం ధర్మపురి పట్టణంలోని కళాశాల మైదానంలో జరిగిన ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమానికి ఆయన హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. . ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ మాట్లాడుతూ,ప్రతి సంవత్సరం నిర్వహించుకునే ఆరు ఉత్సవాలలో విశిష్టమైనది ఉగాది ఉత్సవమని, సంఘ నిర్మాత పరమపూజ్య డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవర్, జన్మించి రోజు కావడం విశేషమని ఉన్నారు.. డాక్టర్ చిన్నతనం నుంచే దేశం పట్ల భక్తి భావన కలిగి, దేశ బానిసత్వానికి కారణం అనైక్యత అని గుర్తించి, వైద్య విద్యను అభ్యసించిన ఈ సమాజం బానిసత్వానికి, ఐకమత్యం లేకపోవడమే ఆయన గుర్తించాలని శంకర్ జి అన్నారు. అనైక్యత అనే వ్యాధికి ఐకమత్యమే మందు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం ను 1925లో ఆవిర్భవించిందని ఆయన వివరించారు.ఈ సందర్భంగా స్వయం సేవకులు చేసిన కర్రసాము, నియుద్ధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో , ఖండ కార్యవహ్ ఇంద్రాల శేఖర్, సంగి నర్సయ్య, రంగు లక్ష్మీనరహరి, గుడ్ల నరహరి, మరియు స్వయం సేవకులు పాల్గొన్నారు.


ఎమ్మెల్యే రఘునందన్ రావు కు సన్మానం !


మంచిర్యాల, కోమరంభీం జిల్లాల పర్యటన కు వెళుతున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ను మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, బీజేపీ శ్రేణులు గోదావరిఖనిలో ఘన స్వాగతం పలికి సన్మానించారు.

అనంతరం చెన్నూరు నియోజకవర్గం లోని, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మల్లపేట గ్రామానికి చెందిన, 100 మంది యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి వివేక్ వెంకటస్వామి స్వాగతించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రగునాథ్ ,జిల్లా ప్రధాన కార్యదర్శిలు అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేష్, వెంకటేష్ గౌడ్, శుషీల్, పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.


ఆర్య వైశ్య సంఘ కమ్యూనిటీ హాల్ ప్రారంభం !!
జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో TUFIDC నిధులతో నిర్మించిన ఆర్య వైశ్య కమ్యూనిటీ హాలును స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. దాదాపు 75 లక్షల రూపాయల నిధులతో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగింది.

ఈ కార్యక్రమంలో వైశ్య సంఘ అధ్యక్షులు మంచాల కృష్ణ, మాజీ అధ్యక్షులు చకినం కిషన్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, కౌన్సిలర్ లు కప్పల శ్రీకాంత్, బొడ్ల జగదీష్, AMC డైరెక్టర్ బట్టు ప్రవీణ్, కౌన్సిలర్ లు పాంబాల రాము,అల్లే గంగ సాగర్,దాసరి లావణ్య ప్రవీణ్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, సీనియర్ నాయకులు దావా సురేష్, యూత్ నాయకులు కూతురు శేకర్, ,వైశ్య సంఘ ,నాయకులు, సభ్యులు తదితరులు, పాల్గొన్నారు.