‘ఒమిక్రాన్ ఎక్స్ఈ’ భారత్‌లోకి ప్రవేశించింది. ముంబయిలో తొలి కేసును అధికారులు గుర్తించారు.
కరోనా వైరస్ ఒమిక్రాన్ రకం కన్నా 10శాతం వేగంగా వ్యాపించగల సరికొత్త వేరియంట్ భారత్‌లోనూ వెలుగుచూసింది. ‘ఒమిక్రాన్ ఎక్స్ఈ’ రకం కరోనా వైరస్‌ను ముంబయిలో గుర్తించినట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ ధర్నా
.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్, పెట్రోల్, డీజిల్, గ్యాస్, సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన, ఇందిరా భవన్ నుండి బయలుదేరి స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన తెలిపి అనంతరం ఆర్డీవో కి వినతి పత్రం ఇచ్చారు.

షోరూమ్ ప్రారంభోత్సవం!
జిల్లా కేంద్రంలో LNR ఈ-బైక్ షో రూం ను బుధవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత, మున్సిపల్ ఛైర్ పర్సన్ భోగ శ్రావణి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్మార్ట్ ఫోన్లు పంపిణీ!
ఈ రోజు IMA హాల్లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన జగిత్యాల రూరల్, అర్బన్ మరియు సారంగాపూర్, మండలానికి చెందిన ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేష్ ,సారంగాపూర్ ఎంపీపీ కోల జమున శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బోగా శ్రావణిప్రవీణ్ ,పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి ,డిప్యూటీ DMHO జైపాల్ రెడ్డి , ఆశ వర్కర్ల తదితరులు పాల్గొన్నారు.
