పల్లె ప్రగతికి సంసిద్ధంగా ఉండాలి-జెడ్పీ చైర్ పర్సన్
శ్రీమతి దావ వసంత సురేష్, చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములో జగిత్యాల జిల్లాలోని సమస్త మండల పరిషత్ అభివృద్ది అధికారులతో జిల్లాలో చేపట్ట బడుచున్న అభివృద్ది కార్యక్రమములపై బుధవారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ,
ఈ సమావేశములో శ్రీ ఎస్.రామానుజాచార్య, జి.ప్ర.ప. FAC ముఖ్య కార్యనిర్వణ అధికారి, .ఎస్.వినోద్, డి.ఆర్.డి.ఓ శ్రీ ఈ.హరికిషన్, డి.పీ.ఓ. మరియు సమస్త మండల పరిషత్ అభివృద్ది అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీమతి దావ వసంత సురేష్, చైర్ పర్సన్ జిల్లా ప్రజా పరిషత్ జగిత్యాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
గత పల్లె ప్రగతి కార్యక్రమము ద్వారా గ్రామాలలో పరిశుబ్రత పచ్చదనం కోసం హరితాహారం, నర్సరీ, డంపింగ్ యార్డ్, వైకుంట దామము,కమ్యూనిటి సోక్ పిట్లు,మ్యాజిక్ సొక్ పిట్లు మరియు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగినది.

పల్లె ప్రకృతి వనాలలో గ్రామప్రజలకు స్వచ్చమైన గాలి మరియు ఆహ్లాద కరమైన వాతావరణం అందుబాటులో వుండి ఆరోగ్యము చేకురుటకు ఉద్దేశించిన నీడనిచ్చే మొక్కలు, పూల మొక్కలు, ఔషదం (హెర్బల్) మొక్కలను పెంచి అందుబాటులో ఉండునట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..పండ్ల మొక్కలను పల్లె ప్రకృతి వనాలలో పెంచరాదని అన్నారు. వేసవి కాలములో గ్రామములోని నీటిఎద్దడిని అధిగమించుటకు దోహదం పడే ఇంకుడు గుంతలను (కమ్యూనిటి మరియు మ్యాజిక్ సోక్ పిట్లను) వెంటనే పూర్తి చేయాలని , జిల్లాలోని సమస్త మండల పరిషత్ అభివృద్ధి ఆధికారులు విధిగా గ్రామాలను సందర్శించి గ్రామాలలో గల సమస్యలను తెలుసుకొని సంబంధిత ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యము తో సమస్యల పరిష్కారం చేయుటకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు.

ప్రతి నెలలో ఎన్ని గ్రామాలు సందర్శించిన పూర్తి వివరములతో టూర్ డైరీ ని మరియు మండలములోని గ్రామములలో వివిధ పథకముల ద్వారా చేపట్టబడుచున్న అభివృద్ది పనుల యొక్క ప్రగతి నివేదికలను జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయమునకు ప్రతి నెల 5 వ తేది లోగా విధిగా సమర్పించుటకు ఆదేశించారు.
మండల పరిషత్ అభివృద్ధి ఆధికారులు విధి నిర్వహణ లో ఏలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రభుత్వ ఆదేశములను పాటిస్తూ గ్రామాలలో ప్రభుత్వ పథకముల ద్వారా 100 శాతం అభివృద్ధి జరిగే విధముగా చర్యలు చేట్టాలని ఆదేశించారు., వచ్చే నెలలో తేది:20-05-2022 నుండి తేది:05-06-2022 వరకు పల్లె ప్రగతి కార్యక్రమము చేపట్టుటకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ నిర్ణయించినందున గ్రామాలలో చేపట్టవలసిన అంశములపై సంబంధిత అధికారుల మరియు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యముతో ప్రణాళికలు సిద్దము చేసుకొనుటకు ఆదేశించారు
విలీన గ్రామాల కు 13% హెచ్ఆర్ ఏ వర్తింపజేయాలి!
ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి !

.
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పురపాలక సంస్థల పరిధి పెరిగినందున, పెరిగిన పరిధి నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గల గ్రామాలను నోటిఫై చేసి ఆయా గ్రామాలలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 13% హెచ్ ఆర్ ఎ వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి కి బుధవారం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు కూర రగోత్తం రెడ్డి వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ రోడ్లు మరియు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు తగుచర్యలు నిమిత్తం ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో PRTUTS జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ఆనందరావు పాల్గొన్నారు