పావని ఆసుపత్రిలో ఉచిత కంటి ఆపరేషన్లు !

జగిత్యాల నియోజకవర్గ మరియు పరసర ప్రాంత పరిధిలోనీ 19మంది నిరుపేదలకు ఆపి, రోటరీ క్లబ్ మరియు జగిత్యాల పావని కంటి ఆసుపత్రి, అధ్వర్యంలో ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ చేశారు.


ఈ కార్యక్రమంలో డా.విజయ్, రాయికల్ మున్సిపల్ ఛైర్మెన్ మోర హాన్మండ్లు, సర్పంచ్ బోనాగిరి నారాయణ, AMC డైరెక్టర్ తిరుపతి గౌడ్, పెంబట్ల ఆలయ కమిటీ మెంబర్ శ్రీనివాస్, నాయకులు గంగారాం,నక్క హరీష్, కాషెట్టి తిరుపతి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


కెసిఆర్ పాలనలో శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు!


శుష్క వాగ్దానాలు,శూన్య హస్తాలు, తెలంగాణ ప్రజలకు ద్రోహం తలపెట్టడం- కుటుంబంకు , అనుచర వర్గానికి ప్రజల సొమ్ము దోచి పెట్టడమే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాన ఎజండా అని, మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు కటుకం మృత్యుంజయం ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన బిజెపి నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ కోసం చావు నోట్లో తల పెట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్..కేంద్రమే తన మెడపై కత్తిపెట్టి బెదిరించిందన్న వ్యాఖ్యలు హాస్యాస్పదం అని మృత్యుంజయం ఎద్దేవా చేశారు. ఒక గంట కూడా రైతుల కోసం దీక్షలో కూర్చోని నాయకుడు., కేవలం తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్ల ప్రతినిధిగా మాత్రమే ఢిల్లీలో దీక్ష అని దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రి దీక్షలో కూర్చుంటే..ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కనీస మర్యాదకైనా సంఘీ భావం తెలిపారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం వడ్ల రాధ్దాంతం నడుపుతూ రైతాంగంను మభ్యపెడుతున్నారన్నారన్నారు, కేంద్రం మెడలు వంచుతామని ప్రగల్భాలు పలికిన కెసిఆర్ ను బిజెపియే ఆయన మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసేలా చేసిందన్నారు. , ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్న ప్రభుత్వం వాటిల్లో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలెకపోతుందన్నారు.
పోలీసు యంత్రాంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకుని భాజపా, ప్రతిపక్షనాయకులపై, అక్రమ కేసులు బనాయిస్తుండడం అప్రజాస్వామికమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తుండడం విచారకరమన్నారు. మరో వైపు ధనిక రాష్ట్రమని చెబుతున్న ముఖ్యమంత్రి ఉద్యోగులకు వేతనాలు కూడా సరిగా అందించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు., కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, తమ కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ, మెగా కృష్ణారెడ్డి కి ప్రాజెక్ట్ లను అప్పగిస్తున్నారని విమర్శించారు .
రాష్ట్రంలో ఎక్కడ నీరు కనబడినా…అవి కాళేశ్వరం నీళ్లేనని ప్రజల్ని, ప్రపంచాన్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 10 వేల ఎకరాలకు కూడా నీరు అందించలేదని ఈ ప్రభుత్వ ప్రకటనలు అన్నీ బూటకమని విమర్శించారు. విలేఖర్ల సమావేశంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, బిజెపి పట్టణ అధ్యక్షులు అనిల్, మదన్మోహన్, పవన్ సింగ్, దివాకర్ ,రవితేజ, p ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు .


వస్త్రాలంకరణ కార్యక్రమలో


బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ గారి కుమార్తె మోక్షన పుట్టు వస్త్రాలంకరణ కార్యక్రమనికి హజరై అశీస్సులు అందించిన EX ZP చైర్మన్, జగిత్యాల DCC అద్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓయూ జేఏసీ చైర్మన్ కండ్లె మదన్ ,అవుల శ్రీనివాస్, నిశాంత్ రెడ్డి, మెరుగు మురళి, శైలెందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, అవుల వేణు తదితరులు పాల్గొన్నారు..