కొండగట్టు క్షేత్రానికి – భారీ బందోబస్తు అదనపు ఎస్పీ రూపేష్

హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా..


ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు లో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ రూపేష్ తెలిపారు.
హనుమాన్ జయంతి బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు సిబ్బందిని ఉద్దేశించి అదనపు ఎస్పీ మాట్లాడుతూ చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

ఏదైనా సమస్య ఎదురైతే జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని, భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలని అన్నారు. బందోబస్తు కు సంబంధించి 8 సెక్టారులు గా విభజించడం జరిగింది అని అన్నారు..అనంతరం ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాటలను పరిశీలించారు.


డిఎస్పి లు ప్రకాష్, రవీందర్ రెడ్డి, సి.ఐ రమణమూర్తి, కృష్ణకుమార్, వివిధ జిల్లాలకు చెందిన సిఐలు, ఎస్ఐలు పోలీసు సిబ్బంది అడిషనల్ ఎస్పీ వెంట ఉన్నారు.


ఆహారం పంపిణీ..
కొండగట్టు అంజన్న సన్నిధికి నడక దారిన వస్తున్న హనుమాన్ భక్తులకు పండ్లు, ఆహారం పంపిణీ దాత శ్రీ రాముల బిక్షపతి చేపట్టారు.


జయంతి ఉత్సవాలు ప్రారంభం.,


దాదాపు 3 లక్షల మంది భక్తులు రావచ్చు ?
3 రోజులపాటు(ఈనెల 16 వ తేదీ వరకు) కొనసాగనున్నాయి. ఆలయంలో అర్జిత సేవలు రద్దు చేసి.. అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించక పోవడంతో ఈ సారి భారీ స్థాయిలో హనుమాన్‌ దీక్ష పరులు కొండపైకి చేరుకొని మాలవిరమణ చేయనున్నారు.


సుమారు 3 లక్షల మంది భక్తులు ఆలయానికి రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బారికేడ్లు, మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో వెంకటేశ్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి భద్రత పర్యవేక్షిస్తున్నట్లు డీఎస్పీ రత్నాపురం ప్రకాశ్ తెలిపారు.

బండి సంజయ్ రెండవ విడత పాదయాత్ర !


బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండవ విడత సందర్భంగా భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, శ్రేణులు, జోగులాంబ క్షేత్రానికి తరలివచ్చారు.తరలివచ్చారు అలంపూర్ జోగులంబా అమ్మ వారిని దర్శించుకొని సంజయ్ తో యాత్రను ప్రారంభించారు.

బిజెపి నాయకులు డీకే అరుణ, విజయశాంతి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రాష్ట్ర జాతీయ నాయకులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.