సంపూర్ణ ఆరోగ్య మే ప్రభుత్వ లక్ష్యం- చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ

తల్లి పిల్లల సంపూర్ణ ఆరోగ్యం, అవగాహన కోసం. ప్రభుత్వము పోషణ పక్వడ్ పథకం అమలులో తెచ్చి అమలు చేస్తున్నది అని ధర్మపురి మున్సిపల్ చెర్మెన్ సంగీ సత్యమ్మ అన్నారు. సోమవారం ధర్మపురి లోని న్యూ హరిజనవాడ అంగన్ వాడి కేంద్రంలో జరిగిన పోషన్ అం అం పక్వాడ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రామయ్య, పాల్గొని అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ బహుకరించారు.

కౌన్సిలర్లు తరాల కార్తీక్ ,సుధాకర్ ధర్మపురి ICDS C.D.P.O సంపద కుమారి, సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పిల్లలు తల్లులు గర్భిణీలు కిషోర్ బాలికలు, తల్లిదండ్రులు హాజరయ్యారు. శుచి శుభ్రత, పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, గర్భిణీలు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పౌష్టికాహారం తదితర అంశాలపై సిడిపిఓ సంపద కుమారి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు మాధవి లత, సిహెచ్ లక్ష్మి, kvr లక్ష్మి, గంగా జమున, జరీనా, పుష్ప , అనిత, శ్వేత, పద్మ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.