ప్రాణహిత కు హారతి !

ప్రాణహిత పుష్కరాల సందర్భంగా శనివారం  వేమనపల్లి పుష్కర ఘాట్ వద్ధ ధర్మపురి దేవస్థానం పక్షాన సాయంత్రం ప్రాణహిత నదీమతల్లికి  హరతి ఇచ్చారు.  నదీ తీరం వద్ద వేద మంత్రోచ్ఛారణలతో నదికి ఘనంగా పూజాది కార్యక్రమాలు వేదపండితులు అర్చకులు నిర్వహించారు. అనంతరం ప్రాణహిత నది లో   వాయనం, ( చీర జాకెట్ గాజులు సుగంధ పరిమళాలు ) దీపాలు వెలిగించి నదిలో వదిలారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ,రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య , వేముల నరేష్ , అక్కనపల్లి సురేందర్  ,వీరవేణి కొమురయ్య ,.సంగెం సురేష్ , చుక్క రవి, పల్లెర్ల సురేందర్ , .వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ ,హరికృష్ణ ,ఉపప్రదాన అర్చకులు నేరెళ్ళ శ్రీనివాసాచార్య , అర్చకులు  సముద్రాల వంశీకృష్ణ , బొజ్జ సంతోష్ కుమార్,  సంపత్ కుమార్ , రాజగోపాల్ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, మరియు ఘాట్ ఇంచార్జి  M.రవి , సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.


రంగస్థల నటుడు నరహరి కి అవార్డు !


భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్త నిర్వహణలో” తెలంగాణ యువ నాటకోత్సవం” కార్యక్రమంలో భాగంగా  శుక్రవారం రోజున రవీంద్ర భారతి హైదరాబాదులో జరిగిన  కార్యక్రమంలో ధర్మపురి క్షేత్రానికి చెందిన  కొరిడె నరహరి శర్మ  (సెక్రెటరీ. నరహరి) కి “స్ఫూర్తి” అవార్డు ప్రధానం చేసి ఘనంగా సన్మానించారు.. 1967 నుంచి గత ఆరు దశాబ్దాలుగా పద్య, సాంఘిక, చారిత్రాత్మక, జానపద నాటకాలలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, సూర్యుడు, శంకరుడు, నారదుడు, వీరపాండ్య కట్టబొమ్మన, వీరకాపయ, అదేవిధంగా రేపెంటి, కొత్త చిగురు, ఆకు రాలిన వసంతం, మిస్టర్ వైజాగ్, నరకంలో లంచం, ఇచ్చట సన్మానాలు చేయబడతాయి, లాంటి సాంఘిక నాటకాలలో కూడా విభిన్న పాత్రలు వేసి రంగస్థల సినీ ప్రముఖులు మన్ననలు పొందారు.. తెలుగువారికి సొంతమైన పద్య నాటకాన్ని, అదేవిధంగా రంగస్థలం రంగాన్ని తనవంతుగా సంరక్షిస్తూ నేటి యువతరానికి “స్ఫూర్తిదాత” గా నిలుస్తున్నారు.  ఇటు నాటకరంగం, అటు శాస్త్రీయ  సంగీతానికి ,సేవలందిస్తున్న  కోరిడె నరహరి శర్మ భవిష్యత్తులో పద్మశ్రీ లాంటి అత్యున్నత పురస్కారాలు అందుకోవాలని పలువురు కళాభిమానులు కోరుకుంటున్నారు.


కుట్టు శిబిరం ప్రారంభం!


.జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం  రాపల్లె గ్రామాలలో షెడ్యూల్ కులాల వార్షిక ప్రణాళిక  2020-21 క్రింద ఎస్.సి యువకులకు స్టార్ మహిళా మండలి ద్వారా నిర్వహిస్తున్న కుట్టు మిషన్ పై శిక్షణ  శిబిరాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పి చైర్ పర్సన్ దావతులు ప్రారంభించారు.