. ప్రాణహిత నది పుష్కరాలు నేటితో ముగియనున్న సందర్భంగా ఆదివారం కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ధ సాయంత్రం పవిత్ర ప్రాణహిత నదీకి హరతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం దేవాలయం నుండి . మేళతాళాలు, మంగళ వాయిద్యాలు,కోలాటం ఆడుతూ నదీ తీరం వరకు ఊరేగింపుగా వేదపండితులు అర్చకులు భక్తజనం ఆలయ అధికారులు నది వద్దకు తరలివచ్చారు. నది వద్ద వేద పండితులు, అర్చకులు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం ప్రాణహిత నది కి వాయనం, ( చీర, జాకెట్, గాజులు మరియు సుగంధ పరిమళాలు ) దీపాలు వెలిగించి నదిలో వదలడం జరిగింది. కార్యక్రమమం లో నదివద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక పైనుంచి పవిత్ర ప్రాణహిత నది కి హారతినివ్వడంతో ప్రాణహిత పుష్కారాలు. ముగిసినట్టు వేదపండితులు అధికారులు ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి వివరించారు. ఈ కార్యాక్రమాన్ని స్థానికులతో పాటు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలనుండి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో వీక్షించి తన్మయత్వం పొందారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖా (ఏడీసీ) ఎండోమెంట్ అడిషనల్ కమీషనర్ కె. జ్యోతి, అసిస్టెంట్ కమీషనర్ ఆర్. సునీత, దేవాలయం ఈఓ మహేష్, మహాదేవపూర్ ఎంపిపి రాణిబాయి తదితరులు పాల్గొన్నారు.

అర్జున్ గుట్ట వద్ద..
ఈరోజు అర్జునగుట్ట పుష్కర ఘాట్ వద్ధ ధర్మపురి దేవస్థానం పక్షాన సాయంత్రం ప్రాణహిత నదీమతల్లికి మేళతాలాలతో హరతి ఇచ్చిన తదుపరి నదిలో వాయనం , దీపాలు వదలడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వరంగల్ జోన్ ఉపకమీషనర్ శ్రీ శ్రీకాంత్ రావు మరియు దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్

, మాజీ MLC శ్రీ పురాణపు సతీష్ రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య , అక్కనపల్లి సురేందర్ ,వీరవేణి కొమురయ్య , పల్లెర్ల సురేందర్ , ఇనగంటి రమ , వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , పాలెపు ప్రవీణ్ కుమార్ , హరికృష్ణ , ఉపప్రదాన అర్చకులు నేరెళ్ళ శ్రీనివాసాచార్య .,ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచర్య , అర్చకులు సముద్రాల వంశీకృష్ణ , బొజ్జ సంతోష్ కుమార్ సంపత్ కుమార్ ,రాజగోపాల్ , మరియు పుష్కరాల లేజన్ ఆఫీసర్ రవికిషన్ , ఘాట్ ఇంచార్జి అనూష , మరియు గోదావరిఖనికి చెందిన కోలాట నృత్యం మహిళలు మరియు అధిక సంఖ్యలో భక్తులు ,సిబ్బంది పాల్గొన్నారు.
