ప్రవర్తనలో మార్పు సాధించాలి – కలెక్టర్ జి. రవి !


జగిత్యాల ఏప్రిల్ 16:- జైలు జీవితం ద్వారా ప్రవర్తనలో మార్పు సాధించాలని, మంచి అలవాట్లను అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జై రవి ఖైదీలకు సూచించారు. శనివారం జగిత్యాల జిల్లాలోని సబ్ జైలు ను సందర్శించి, మంచినీటి ఆర్ఓ ప్లాంట్ ను లాంఛనంగా ప్రారంభించారు.

జగిత్యాల జిల్లా సబ్ జైలు వినియోగానికి గాను ప్రతి గంటకు 500 లీటర్ల మంచినీరు అందించే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ రూ.95150/- నిధులను మంజూరు చేశారు. జిల్లా కలెక్టర్ నిధుల కేటాయింపు తో ఏర్పాటు చేసిన మంచినీటి ఆర్ఓ ప్లాంట్ ను కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆవేశంలో లో చాలా మంది తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్నారని, జైలు జీవితంలో మంచి ప్రవర్తన అలవర్చుకోవాలని సూచించారు.
ఖైది ల జీవితంలో క్రమశిక్షణ గా జీవించడం , యోగా మెడిటేషన్, నైపుణ్యాలు పెంపొందించే దిశగా శిక్షణ అందిస్తున్నామని వాటిని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని, శిక్ష కాలం పూర్తయిన తర్వాత సమాజంలో మంచి పౌరులుగా జీవించడానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.


జైలు జీవితం గడిపిన చాలా మంది వారి పరివర్తనలో మార్పు సాధించి జీవితంలో మంచి స్థాయికి చేరుకున్నారని, సకాలంలో మంచి అంశాల పట్ల శ్రద్ధ వహించి నేర్చుకోవాలని, మంచి సహవాసాలు చేయాలని మరోసారి తప్పు చేయాలనే ఆలోచన రాకూడదని కలెక్టర్ సూచించారు. జైలులో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన మేర తన వంతు సహకారం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.


జైలు పరిసరాల చుట్టూ తిరిగి పరిశీలించిన జిల్లా కలెక్టర్ పరిసరాల పరిశుభ్రత, జైల్లో గార్డెన్ చెట్ల పెంపకం వంటి వాటిని అభినందించారు. జైలు చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ సంబంధిత అధికారులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జైళ్ళ అధికారి శ్రీనివాస్, జగిత్యాల సూపరిండెంట్ ఆఫ్ జైల్ సత్తయ్య , ఆర్.డి.ఓ.జగిత్యాల ఆర్.డి. మాధవి , తసీల్దార్,సంబంధిత అధికారులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల సమర్పణ గడువు పొడగింపు !


సబ్- ఇన్ స్పెక్టర్ మరియు పోలీసు కానిస్టేబుల్స్
ఉచిత ఫ్రీ- ఎగ్జమినేషన్ రేసిడేన్సియల్ కోచింగ్ కొరకు దరఖాస్తు చేసుకొనుట తేది: 18-04-2022 వరకు పొడగించారు. పోలీసు శిక్షణా సంస్థలలో, రాష్ట్ర ప్రభుత్వం జారి చేయనున్న సబ్- ఇన్ స్పెక్టర్ మరియు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల కొరకు, (100) మంది షెడ్యూలు కులాల నిరుద్యోగులకు రెండు నెలల పాటు ఉచిత ఫ్రీ-ఎగ్జమినేషన్ రేసిడేన్సియల్ కోచింగ్ నిర్వహించాలని నిర్ణయి౦చనైనది. అభ్యార్ధుల ఎంపిక SI కోసం గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు పోలీసు కానిస్టేబుల్స్ ఇంటర్మీడియట్ మార్కుల ఆదారంగా మరియ శారీరక దారుడ్యం కలిగి యు౦డవలెను.


సబ్- ఇన్ స్పెక్టర్ మరియు పోలీసు కానిస్టేబుల్స్ ఉద్యోగ ఖాళీల బార్తికి ప్రభుత్వం నిర్ణిత వయస్సు పెంచినందున, సబ్- ఇన్ స్పెక్టర్ మరియు పోలీసు కానిస్టేబుల్స్ ఉచిత ప్రీ- ఎగ్జామినేషన్ రేసిడేన్సియల్ కోచింగ్ కొరకు దరఖాస్తు గడవును తేది. 18-04-2022 వరకు పోడగింపబడినది.
జగిత్యాల జిల్లాలోని అర్హులైన (S.C) యువత గమనించి, ఇట్టి అవకాశమును వినియోగించుకోగలరిని ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తుల ఫారం “www.tsstudycircle.co.in” లో ఉంది. ఇతర వివరముల కొరకు 8790806134 ఫోన్ నెంబర్లు సంప్రదించవలసినదిగా ప్రకటనలో వివరించారు.