ప్రశాంత్ కిషోర్ కు బంపర్ ఆఫర్ ?

J. Surender Kumar,


రాజకీయ పార్టీలకు, కనిపిస్తున్న చుక్కాని, ట్రెండింగ్ లో ఉన్న రాజకీయ వ్యూహకర్త, ప్రముఖ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ (పీకే) కు టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ .బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొంది. రాజ్యసభ పదవి కట్టబెడతారా? లేక ఢిల్లీ లో క్యాబినెట్ హోదా గల ప్రభుత్వ సలహాదారు. పదవి కట్టబెడతారా ? అనే విషయంలో స్పష్టత లేదు. ప్రశాంత్ కిషోర్ టిఆర్ఎస్ పార్టీలో చేరుతారా ? ఐప్యాక్ సంస్థ వ్యవస్థాపకుడిగా కొనసాగుతారా ? ఈ విషయంలో క్లారిటీ లేదు. మోడీ ప్రభుత్వాన్ని రానున్న 2024 ఎన్నికలలో ఢీ కొట్టడం కోసం కెసిఆర్ ముందస్తుగా రాజకీయంగా అస్త్ర ,శస్త్రాలు సిద్ధం చేయడంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ కు పదవి యోగం లభించవచ్చనే చర్చ నెలకొంది.


రేపో, మాపో, కాంగ్రెస్ లో చేరుతున్నట్లు, అధినేత్రి సోనియా గాంధీ, ప్రశాంత్ కిషోర్ కు పార్టీలో. కీలక పదవి బాధ్యతలు అప్పగించనున్నట్లు, ప్రచార మాధ్యమాల తోపాటు, కాంగ్రెస్ నేతలు సైతం ఈ అంశంను ధృవీకరిస్తూ మాట్లాడారు. 2024 లో కాంగ్రెస్ పార్టీ 370 స్థానాలు లక్ష్యం అంటూ, రూట్ మ్యాప్, పవర్ ప్రజెంటేషన్, సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేతలతో ప్రశాంత్ కిషోర్ చర్చలు తదితర అంశాలు విధితమే.


24న హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ కిషోర్ , ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో చర్చలు, రాత్రి అక్కడే మకాం, ఇతర సంఘటనల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్, తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు. ఐప్యాక్ సంస్థ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకే పని చేస్తుందని ప్రకటించారు.


ప్రగతి భవన్ చర్చలు ఏమిటో ?


సీఎం కేసీఆర్ ,ప్రశాంత్ కిషోర్, ల మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి ? . జాతీయ రాజకీయాలపై జరిగాయా? రాష్ట్ర రాజకీయాల పైన జరిగాయా ? దేశంలో ఆయా రాజకీయ పార్టీల , స్థితిగతులపై జరిగాయా? 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని ఎలా ఢీ కొనాలి ? ఆయా రాష్ట్రాల్లో సమస్యలు, ఉద్యోగ, ఉపాధి, అవకాశాలు. రాజకీయ పార్టీలతో పొత్తులా ? తదితర అంశాలపై వీరి మధ్య చర్చలు, తర్జనభర్జన జరిగి ఉండవచ్చు! ఉండకపోవచ్చు ! వీరి మధ్య జరిగిన చర్చలు అంశాలు, సారాంశాలు , వాస్తవాలు ఎవరికి తెలిసే అవకాశమే లేదు ?. ఊహించడం, ఊహాగానాలు తప్ప ! వాస్తవాలు కాకపోవచ్చు!


సజ్జల ప్రకటన ఎందుకో ?


తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని ట్విట్టర్ వేదికగా ప్రశాంత్ కిషోర్ . ప్రకటించిన కొన్ని గంటల్లోపే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికార వైయస్సార్ సిపి పార్టీ, ప్రభుత్వ సలహాదారు, సజ్జల రామకృష్ణారెడ్డి, రాజకీయ సందర్భం లేకుండా, ” ప్రశాంత్ కిషోర్ తో, వారి ఐప్యాక్, సంస్థతో వైయస్సార్సీపి పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని, ప్రచార మాధ్యమాల్లో ప్రకటించారు. 2019 వరకు మా పార్టీ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్, అతని సంస్థ పని చేసిందని, ఆ తర్వాత తమకు, తమ పార్టీకి ప్రశాంత్ కిషోర్ తో రాజకీయ సంబంధాలు లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేయడం. ప్రస్తావనార్హం. దీంతో ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్ మధ్య. ఎలాంటి చర్చలు జరిగాయో? అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


దేశ్ కి నేత కేసీఆర్ !


గత కొన్నినెలలుగా మోడీ ప్రభుత్వానికి, కేసీఆర్ కు మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, యాసంగి వడ్లు కొనుగోలు, అంశంతో బహిర్గతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ విధానాల కు వ్యతిరేకంగా టిఆర్ఎస్ శ్రేణులు, ధర్నాలు, ఢిల్లీలో తెలంగాణ భవనం ముందు కేసీఆర్, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ,ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేయడం తదితర అంశాలు విధితమే. హైదరాబాద్ లో జరిగిన టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ‘దేశ్ కి నేత కేసీఆర్’ అంటూ నినాదాలు చేయడం పార్టీ శ్రేణులు, కెసిఆర్ ను, జాతీయ రాజకీయాల్లో, క్రియాశీలక పాత్ర పోషించాలని తీర్మానించడం, కెసిఆర్, మంత్రుల, ప్రసంగాల్లో మోడీ ప్రభుత్వ విధానాలను ఆయా రాష్ట్రాల హక్కులను, హరిస్తున్న తీరును, పెరుగుతున్న నిరుద్యోగం, ఇంధనము, సరుకుల ధరలు పెరగడం, తదితర అంశాలపై ఘాటుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే . ప్లీనరీకి రెండు రోజుల ముందు ప్రగతి భవన్ లో ప్రశాంత్ కిషోర్, కెసిఆర్ ల మధ్య చర్చల నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వాన్ని ప్లీనరీలో టార్గెట్ చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ప్రశాంత్ కిషోర్ కు పదవీ లాలస ?.


ట్రెండింగ్ లో ఉన్న రాజకీయ అనేసిలిస్ట్ ప్రశాంత్ కిషోర్ కు రాజకీయ పదవి వ్యామోహం ఉన్నట్టు గత ఉదంతాలు నేపథ్యంలో నిర్ధారించుకోవచ్చు. బీహార్ లో నితీష్ ప్రభుత్వం లో ఆయన పార్టీ పదవిలో కొంతకాలం కొనసాగారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ , ప్రశాంత్ కిషోర్ ను ప్రిన్సిపల్ కార్యదర్శి గా క్యాబినెట్ హోదా కల్పిస్తూ నియమించుకున్నారు. కొంత కాలంగా కొనసాగిన పీకే పదవికి రాజీనామా చేశారు. .. పీకే కాంగ్రెస్లో లో చేరుతున్న క్రమంలో తనకు, పార్టీలో కీలక పదవి ఇవ్వాలని, ఆయా రాష్ట్రాలలో తాను సూచించిన వారికే పార్టీ టికెట్లు ఇవ్వాలని, పీకే డిమాండ్లలో ఇది ప్రధాన డిమాండ్ గా రాజకీయ పార్టీల్లో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కు రాజ్యసభ నా ? క్యాబినెట్ హోదా గల సలహాదారు పదవా ? ఏదో ఒకటి ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


రాజ్యసభ ఎన్నికలకు నెల రోజుల వ్యవధి !


టీఆర్ఎస్ పార్టీకి చెందిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి. శ్రీనివాస్, ల రాజ్యసభ పదవి కాలం (21/6/2022) ఈ సంవత్సరం జూన్ 21న ముగియనున్నది. ఈ స్థానాల్లో ఒకటి ప్రశాంత్ కిషోర్ కు. రిజర్వ్ చేసినట్టుగా చర్చలు కొనసాగుతున్నాయి.


P.K నెట్వర్క్ అవసరమే !


గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని 2014 సార్వత్రిక ఎన్నికల్లో, దేశ ప్రధానిగా మోడీ నీ దేశవ్యాప్తంగా హీరోగా, అభివృద్ధి ప్రదాతగా, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న గుజరాత్, చాయ్ వాలా, రన్ ఫర్ యూనిటీ, తదితర రాజకీయ ఎత్తు గడ్డలతో ప్రశాంత్ కిషోర్ బృందం దేశవ్యాప్తంగా మోడీ మానియా, క్రియేట్ చేశారు ,అనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ను, కూడా అదే తరహాలో దేశవ్యాప్తంగా, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఉచిత, నిరంతర, విద్యుత్తు, రైతు బీమా, రైతు బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , తదితర అంశాలతో ఐప్యాక్ ద్వారా ముందస్తు ప్రచారం కు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఎంపీ హోదాలో (రాజ్యసభ ) అధికారిక గణాంకాల వివరాలను, వివిధ రాష్ట్రాల్లో ఆర్థిక స్థితిగతులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తాజా సమాచారం సేకరణకు కూడా హోదా ఉపయోగపడవచ్చు అనే చర్చ ఉంది.

2015 లో బీహార్ రాష్ట్రం(జేడీయు ) 2017 లో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ వెనక, 2019. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ వెనక, 2020 ఢిల్లీలో ఆప్ వెనుక, 2021 పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వెనక, 2021 లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 2021 లో తమిళనాడులో డిఎంకె పార్టీల వెనుక ప్రభుత్వాల ఏర్పాటులో ఐప్యాక్ సంస్థతోపాటు, ప్రశాంత్ కిషోర్ భూమిక కీలకమై చెప్పకతప్పదు. ఈ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాలతో పాటు, అస్సాం, త్రిపుర, మణిపూర్ గోవా ,మహారాష్ట్ర ,రాజస్థాన్ , తదితర రాష్ట్రాలలో ఆయా రాజకీయ పార్టీలో కీలక నేతలతో ప్రశాంత్ కిషోర్ కు స్నేహ సంబంధాలు కలిగి ఉండడం.

దాదాపు 15 రాష్ట్రాల్లో ఐప్యాక్ సర్వే సైన్యం కార్యకలాపాలు, తదితర అంశాలతో పాటు శరత్ పవార్, మమతా బెనర్జీ, క్రేజీవాల్, స్టాలిన్, వైయస్ జగన్మోహన్ రెడ్డి , తదితర రాజకీయ ఉద్దండులతో నేరుగా చర్చలు జరిపే సాహిత్యం ప్రశాంత్ కిషోర్ ఉంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు, మోడీ ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపడం, భారత రాష్ట్ర సమితి .(BRS) ఏ జెండా, వివిధ రాష్ట్రాలలో విస్తృతస్థాయి, ప్రచారంతో పాటు కెసిఆర్ ను జాతీయస్థాయిలో ప్రాజెక్ట్ చేయడంలో ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఎత్తుగడలు, ఐప్యాక్ సంస్థ సర్వేలు, కీలకం కానున్నాయి

. ఈ నేపథ్యంలో ‘ గులాబీ బాస్ నేషనల్ లుక్’ కోసం ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు పాచికలు కెసిఆర్ కు తప్పనిసరి . అందుకోసమే ప్రశాంత్ కిషోర్ కు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ చేసినట్లు చర్చ నెలకొంది.