J.Surender Kumar,
పుష్కర భక్తులకు రైతులు సేవలందిస్తున్నారు. ప్రాణహిత పుష్కర స్నానం కోసం పిల్లాపాపలతో తరలివచ్చే వారి కుటుంబ సభ్యులను తమ ఎడ్లబండ్ల లో నదిలో దూరంగా ఉన్న నీటి ప్రవాహం వద్దకు తరలించి పూజాది కార్యక్రమాల అనంతరం వారిని తిరిగి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.

భక్తజనం ఇచ్చే తృణమో పణమో తీసుకుంటున్నారు తప్ప ఇంత మొత్తం ఇవ్వాలంటూ. రైతులు డిమాండ్ చేయడం లేదు. రైతుల అమాయక అభ్యర్థనలు, తమ ఎడ్లబండిలో రావాల్సిందిగా వారు భక్తులను కోరుతున్న తీరు’ దేశానికి అన్నం పెట్టే రైతన్నలు నేడు ఈ దుస్థితి లో ఉన్నారా ? అనిపించక మానదు.

ఆదినుండి వ్యవసాయంలో ప్రదాన పాత్రను పోషించి, అభివృద్ది పేరుతో పరుగులు పెడుతున్న ప్రస్తుతరోజులలో దాదాపుగా కనుమరుగవుతున్న ఎడ్లబండ్లతో కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద పిండప్రదానం మొదలు స్నాలకు వచ్చే వారికి స్థానిక రైతులు స్వాగతం పలుకుతు ఉపాదిని పొందుతున్నారు.
పత్తి, మిరప, వరి పంటలను వేసి కోతలు కూడా ముగించుకున్న దాదాపు 60, 70 మంది రైతులు కాలేశ్వరం ఉన్నది ద్వారం వద్ద పడిగాపులు కాస్తుంటారు. ప్రాణహిత పుష్కరాలకు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుండి నదిస్నానాలకు ,కుటుంబ సమేతంగా వస్తున్న వారిని నది ఇసుకలో నడవాల్సిందే. కొంతదూరం ఎడ్లబండ్లపై వారిని కూర్చోబెట్టుకొని నదిలో నీటి ప్రవాహం ఉన్న తీరం వరకు వీరు చేరుస్తారు.

ఆహ్వనం పలుకుతు రైతులు ఉపాదిని పొందుతుండగా, ఒకింత తన్మయంత్వంల, వయోభారం. ఆరోగ్య సమస్యలు, తదితర కారణాలతో పాటు మరోసారి ఈ అవకాశం వస్తుందో, రాదో 60, 70 శాతం మంది భక్తులు ఎడ్లబండ్ల లో కూర్చోడానికి. సంతోషం వ్యక్తం చేస్తున్నారు .