రైతు బంధు పథకం రైతులకా? భూస్వాములకా? లక్ష్మణ్ కుమార్



టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు పథకం రైతులకా ? భూస్వాములకా ? ఎవరికి చెందుతుందో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. శనివారం ధర్మపురి పట్టణంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.. ఈ సందర్భంగా ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వం పై పలు ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ తన సామాజిక వర్గానికి ,భూస్వాములకు, అగ్రవర్ణాలకు లబ్ధి చేకూర్చడం కోసమే రైతుబంధు పథకం ప్రవేశపెట్టాడు అంటూ ఆరోపించారు. ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామంలో భూస్వామి పేరిట 400 ఎకరాల కలిగి భూస్వామికి సాలీనా 40 లక్షల రూపాయలు ఆయనకు చెందుతున్నాయని. ఆరోపించారు. 2014 నుంచి 2021 వరకు రైతుల వద్ద వరి ధాన్యం కొనుగోలు చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడెందుకు కేంద్రంపై కొనుగోలు చేయడం లేదంటూ ఆరోపిస్తున్నారో రైతులు గమనించాలని కోరారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పంట పొలాల వద్ద కాంటాలు పెట్టమని గిట్టుబాటు ధర కల్పించి వరి ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. ధాన్యం తరలింపుకు వాహనాలు అందుబాటులో లేకుంటే పోలీసు, రెవెన్యూ శాఖ, సహకారంతో వాహనాలను సమకూర్చి ధాన్యం తరలించామన్నారు. కనీసం హమాలీ చార్జీలు , తరుగు లేకుండా రైతాంగ పై ఎలాంటి భారం పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నాడు కొనుగోలు చేసింది అన్నారు. మన గోదావరి నీరు సీఎం నియోజకవర్గానికి, సిద్దిపేట, సిరిసిల్లకు తరలిస్తున్నారని నీటి దోపిడిని అరికట్టే బాధ్యత మంత్రి కొప్పుల ఈశ్వర్ పై లేదా అంటూ ప్రశ్నించారు ?
వరిధాన్య కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి..పరిపాలన చేసే ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకులు రోడ్లపై ధర్నాలు,నిరసనలు చేస్తే రైతుల పరిస్థితి ఏంటి అంటూ నిలదీశారు..మొదటి నుండి రైతుల పక్షాన ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ధర్మపురిలో తాగునీటికి శాశ్వత పరిష్కారం ఎందుకు చూపట్లేదు? . అని లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు . పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాయకత్వంలో ఈనెల ల ల 12 న రైతులపక్షాన పెద్ద ఎత్తున చేపట్టే నిరసన కార్యక్రమంలో గ్రామ గ్రామాల నుండిఅధిక సంఖ్యలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని, చివరి వడ్ల విత్తు ప్రభుత్వం కొనుగోలు చేసేలా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలిచి రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన అన్నారు . ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దినేష్, వేముల రాజు, సింహరాజు ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


కొండగట్టు క్షేత్రానికి ఏం చేశారు ?
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు క్షేత్రానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో? ఎన్ని నిధులు కేటాయించారో? స్పష్టం చేయాలని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పార పట్టారు. శనివారం చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు,శ్రేణులతో పెద్ద ఎత్తున కొండగట్టు క్షేత్రంలో ధర్నాఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం వేలాది మంది భక్తులు తరలి వచ్చే ఈ క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం కనీస అవసరాలు తీర్చుకునే సదుపాయాలు, వసతి సౌకర్యాలు కూడా లేవన్నారు. ఎమ్మెల్సీ కవిత ఈ క్షేత్రానికి చేసిందేమీ లేదని కేవలం పత్రికల్లో ప్రకటనల వరకే ఆమె పరిమితం అయింది అన్నారు. సీఎం కేసీఆర్ ఒక్కసారైనా కొండగట్టు క్షేత్రానికి రాలేదని బస్సు ప్రమాదంలో అనేక మంది మృతి చెందిన సీఎం రాలేదు పరామర్శించి లేదన్నారు. బాధితులకు మృతుల కుటుంబాలకు నేటికీ న్యాయం జరగలేదని ఆరోపించారు.

వేములవాడ ,నల్లగొండ, కొండగట్టు, ధర్మపురి క్షేత్రాల అభివృద్ధికి తక్షణం నిధులు కేటాయించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రవిశంకర్, ఎంపీ బండి సంజయ్, ఈ క్షేత్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణం కొండగట్టులో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు.. అనంతరం ఆలయ కార్యనిర్వాహణ అధికారి వెంకటేష్ కు మెమోరాండం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


13 న చలో జగిత్యాల విజయవంతం చేయండి !


రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 13న చలో జగిత్యాల్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని రైతులు విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో శనివారం రైతు సంఘం నాయకులు, రైతులతో సమావేశం నిర్వహించారు. రైతు సమస్యలపై ఉద్యమిస్తున్నందుకు పన్నాల తిరుపతి రెడ్డిని రైతులు సన్మానించారు
ఈ సమావేశంలో రైతు సంఘనాయకులు జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి ,వేముల కర్ణాకర్ రెడ్డి, నెరేళ్ళ మున్నూరుకాపు రైతు సంఘం అధ్యక్షులు జాజాల రమేష్ ,ఉపాధ్యక్షులు పాదం చెంద్రయ్య, నెరేళ్ళ రైతు సంఘం అధ్యక్షులు చేక్రల శ్రీనివాస్, కోల రామన్న,పాదం మినయ్య, మల్లేష్,బీమన్న,కసార్ల రమేష్,జాజాల మల్లేశం గనే దుబ్బన్న, చుంచు చెంద్రయ్య, లచ్చన్న, చిట్యాల మల్లయ్య, గంగాధరి చెంద్రయ్య,పురంశెట్టి రవి,లింగన్న రాజన్న, రైతులు పాల్గొన్నారు