రైతులతో పెట్టుకుంటే మీరు తట్టుకోలేరు అంటూ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని హెచ్చరించారు.

తెలంగాణ రైతుల వేసంగి వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి పిలుపు మేరకు రైతుల పక్షాన ఢిల్లీలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సోమవారం నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమ్మద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి ,శ్రీనివాస్ గౌడ్ ,నిరంజన్ రెడ్డి , ఎర్రబెల్లి దయాకర్ రావు, తదితర మంత్రులతోపాటు, రైతు నాయకుడు తికయ్ త్, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత, జగిత్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ కోసం ఢిల్లీలో రైతుల పక్షాన ధర్నా లో. పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రసంగంలో ముఖ్యాంశాలు !
• తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోవడం సరికాదు
• తెలంగాణ మంత్రులతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరు బాగా లేదు
• కేంద్రమంత్రి గోయల్ తెలంగాణ ప్రజలను అవమానించారు.
• రైతులతో పెట్టుకొంటే తట్టుకోలేరని ప్రధాని మోడీని హెచ్చరిస్తున్నా
• ఉమ్మడి రాష్ట్రంలో సాగు రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
• ఆరు దశాబ్దాల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడాం.
• రాష్ట్ర సాధనలో వందలాది మంది యువత బలిదానాలు చేశారు.
• ఉద్యమాల పోరాట ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చింది.
• రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చాం.

• ఆనాడు తెలంగాణలో వెయ్యి ఫీట్ల లోతులో నీళ్లుండేవి.
• దేశంలో ఎక్కడా లేనంతగా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయి.
• మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాం.
• తెలంగాణ వచ్చాక, ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేశాం
• కాకతీయుల నాటి చెరువుల్లో పూడికలు తీయించినం
• పెండింగు ప్రాజెక్టులు చాలావరకు పూర్తి చేసుకున్నం
• కాళేశ్వరం లాంటి కొత్త ప్రాజెక్టులను కూడా కట్టుకున్నం
• దీంతో భూగర్భ జలాలు చాలా పెరిగి, పెకి వచ్చాయి.
• ఇపుడు తెలంగాణలో సాగునీటికి సమస్య లేనేలేదు.
• ఒకనాడు కరెంటు కూడా కేవలం 5 గంటలే వచ్చేది
• రైతులు కరంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు
• తెలంగాణ రాష్ట్రం వచ్చాక కరంటు ఉత్పత్తి పెంచుకున్నం
• మోటార్, విద్యుత్ తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.
• రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే
• ఇటు సాగునీరు, అటు కరంటు సమస్య తీరడంతో, పంటలసాగు పెరిగింది
• అన్నీ బాగుండటంతో తెలంగాణలో వరి ధాన్యం పంట బాగా పండుతున్నది
• ఇలాంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ధాన్యం కొనడం లేదు

• కేంద్రం తీరుతో తెలంగాణ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు
• కేంద్ర ప్రభుత్వం తీరుతోనే మేం ఆందోళనలకు దిగాల్సి వస్తున్నది
• ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ.. రైతులతో గొడవ పడవద్దు
• కేంద్ర ధాన్యం కొనాలని మేం తెలంగాణ నుంచి 2 వేల కి.మీ. వచ్చి దీక్ష చేస్తున్నాం
• ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు?
• ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండబోరని తెలుసుకోవాలి
• కేంద్ర మంత్రి గోయల్ రైతులపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవి
• పీయూష్ గోయల్ ఉల్టాఫల్టా మాట్లాడుతున్నారు.
• పీయూష్ గోయల్ కాదు.. పీయూష్ గోల్‌మాల్.
• గోయల్ కు రైతులపై ఏమైనా అవగాహన ఉందా?
• పీయూష్ గోయల్ మీరు ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడారు?

• తెలంగాణ రైతులను, మంత్రులను అవహేళన చేస్తారా?
• పీయూష్ గోయల్ తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని చెప్పారు.
• మేమేమైనా పీయూష్ గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా?
• కేంద్రమంత్రి పీయూష్‌కు ఎందుకు ఇంత అహంకారం?
• దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయల్ పరుగులు తీయాల్సిందే
• హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు..
• స్వరాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేశామన్నారు.
• రైతు ఏడ్చిన రాజ్యం ఏదీ బాగుపడలేదు.
• ధాన్యం సేకరణకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నాం
• నేషనల్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ రూపొందించాలి
• రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తున్నది
• అగ్రికల్చర్ పాలసీ రూపొందించకుంటే మోదీని తరిమికొడుతాం
• మోదీకి ధనం కావాలి లేదా ఓట్లు కావాలి. ధాన్యం వద్దు..
• ఇదే మీ కేంద్ర ప్రభుత్వం కుట్ర, ఇది రైతు వ్యతిరేకం కాదా?
• రాకేశ్ తికాయత్‌ను కేంద్రం ఎలా అవమానించిందో మనమంతా చూశాం
• తికాయత్‌ను దేశద్రోహి అన్నారు.. ఉగ్రవాది అన్నారు.
• అయినా, రైతుల కోసం అవమానాలు భరిస్తూనే ముందుకు సాగుతున్నారు.
• రైతుల కోసం జాతీయ రైతు ఉద్యమ నేత రాకేశ్ తికాయత్‌తో కలిసి పనిచేస్తాం
• తెలంగాణ ప్రజానీకం రైతు నాయకుడు తికాయత్ వెంటే ఉంటుంది
• తెలంగాణలో పండించే ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాల్సిందే
రైతుల ధాన్యానికి కనీస మద్దతు ధర వచ్చే వరకు రాజీలేని పోరాటం చేస్తానని ఈ సందర్భంగా సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు