పవిత్ర రంజాన్ మాసం ఆరంభం !!

పవిత్రమైన రంజాన్ మాసం ఉపవాసాలు ఆదివారం తెల్లవారుజాము నుండి ఆరంభమయ్యాయి. శనివారం రాత్రి నెలవంక కనిపించిందని, ” రుహితే హిలాల్ కమిటీ ” అధ్యక్షుడు మౌలానా కుబ్బల్ పాష ఖత్తరి ప్రకటన శనివారం రాత్రి ప్రకటించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షను ప్రారంభించాలని ఆయన సందేశం లో సారాంశం.

మహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య పురం ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసం అత్యంత పవిత్రంగా, శ్రద్ధా శక్తులతో ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. తెల్లవారుజాము నాలుగు గంటల ప్రాంతంలోనే భోజనాది కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నిత్యం నిర్వహించే ప్రార్థన కన్నా అధిక సంఖ్యలో నమోదులు తర వీరు చేస్తుంటాడు పవిత్ర ఖురాన్ ను చదువుతుంటారు.

కోపతాపాలు కతీతంగా, సేవా భావంతో, ప్రేమతత్వం తో, కఠోర ఉపవాస దీక్షలు కొనసాగిస్తారు. తెల్లవారుజామున భోజనాది కార్యక్రమాలకు ‘సహార్ ‘ అంటారు ,సాయంత్రం ఉపవాస దీక్షలు విరమించే సందర్భాన్ని ‘ఇఫ్తార్’ అంటారు. ఈ మాసంలో తమ సంపాదనలో కొంత భాగాన్ని బీదలకు ఈ మాసంలో దానధర్మాలు చేస్తుంటారు దాన్ని పిత్ర అంటారు రంజాన్ పండుగ రోజున చేసే దానధర్మాలు ‘ జకాత్’ అంటారు.

ఈ మాసంలో తమ నివాసాల లో ప్రార్థన మందిరాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు . ఇదే మాసంలో జక్నేకి రాత్ ( జాగారం ) చేస్తూ ప్రార్థన మందిరాలలో. మతపెద్దల ద్వారా పవిత్ర ఖురాన్ గ్రంథంలోని ప్రవచనాలు, ప్రసంగాలు వింటుంటారు

.

ఇంటింటికి వెళ్లి చెక్కులు అందజేత !

జగిత్యాల్ అసెంబ్లీ పరిధిలోగల తిప్పన్న పేట, అంబారిపేట, హస్నాబాద్, ధరూర్ గ్రామాల్లో లబ్దిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఇంటింటికీ వెళ్లి చెక్కులను అందజేశారు. సీఎం సహాయ నిధి ద్వారా 14 మందికి 5లక్షల 36 వేల రూపాయల చెక్కులను, 4గురు ఆడపడుచులకు 4 లక్షల 464 రూపాయల చెక్కులను మొత్తంగా 18మంది లబ్దిదారులకు చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

చిన్నారుల కుటుంబాల కు 10 లక్షల చొప్పున ఇవ్వాలి!

ధర్మపురి మండలం లోని తుమ్మెనాల గ్రామంలో ఆదివారం చెరువుకు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ ముగ్గురు చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని జగిత్యాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్కుమార్ డిమాండ్ చేశారు. మృతి చెందిన చిన్నారులు యశ్వంత్, శరత్, మణిదీపం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. చిలుముల లక్ష్మణ్, రాందేని మొగిలి ,స్వీపతి సత్యనారాయణ, స్తంభంకాది గణేష్,గంజాయిల చంద్రకాంత్ ,సతీశ్,నవీన్ ,శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

స్వామి దర్శనం !!

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని, జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా స్వామి వారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పక్షాన డిఎస్వోను ఆశీర్వదించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.