సమాజం లోని ప్రతి ఒక్కరు సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ వాసూజి అన్నారు.,
జగిత్యాల సేవాభారతి ఆద్వర్యం లో ఆదివారం జిల్లా కేంద్రం లో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసం లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మందికి పైగా దంపతులు పాల్గొని శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు



ఈ కార్యక్రమంలో ఆవాస నిర్వాహకులు. డా.భీమనాతిని శంకర్, జీడిగే పురుషోత్తం, నందేల్లి మదన్ మోహన్ రావు, అశోక్ రావు, సంపూర్ణాచారి, చిత్తారి మధుకర్, శ్రీనివాస్, కైలాసం, సాయి మధుకర్, ఆవాసం ప్రముఖ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు

మానస హై స్కూల్లో కల్చరల్ ఫెస్ట్ 2 k22.
జగిత్యాల పట్టణంలోని. ‘మానస స్కూల్ ఆఫ్ ఎక్సల్లెన్స్’ పాఠశాలలో ఆదివారం కల్చరల్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు., ఇందులో భాగంగా విద్యార్థులు భరతనాట్యం, కూచిపూడి, జానపద, సినీగేయ, తెలంగాణ సంస్కృతి పెంపొందించే నృత్య ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ రజిత రావు మాట్లాడుతూ, జగిత్యాల లో మొట్టమొదటి, ఐఐటి మెడిసిన్ పాఠశాల స్థాపించిన, విద్యా సంస్థ మానస స్కూల్ అని, మానస స్కూల్ ఆఫ్ ఎక్సల్లెన్స్ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, మరియు వివిధ రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు కొరకు ఎల్లవేళల కొత్త ప్రణాళికలు రూపొందిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కొరకై మంచి రూపకల్పన చేస్తూ ప్రగతి పథంలో ప్రయత్నిస్తున్నామన్నారు. .

Covid-19 సమయంలో కూడా విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలగ కూడదని ప్రణాళికతో, ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరిగిందనీ, ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు చదివే కాకుండా సంస్కృతిక, శారీరక ప్రదర్శనలు ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నాం అన్నారు.. ముఖ్యంగా వేసవికాలంలో విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తీసుకునే జాగ్రత్తల గురించి సవివరంగా వివరించారు .

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్ రావు , హరిచరణ్ రావు, మౌనిక రావు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.