లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి !

J.Surender Kumar,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం సాయంత్రం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పీకర్ ధర్మపురి కి చేరుకోగానే ఆలయ మహాద్వారం ముందు మంత్రి ఈశ్వర్ ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, ఎంపీపీ చిట్టిబాబు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, ఐ. రామయ్య అభివృద్ధి కమిటీ సభ్యులు, స్పీకర్ కి ఎదురు వెళ్లి స్వాగతించి పూర్ణకుంభంతో ,మేళతాళాలు మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో, స్పీకర్ ను ఆలయంలోకి స్వాగతించారు.

స్పీకర్ స్వామి వారికి ప్రదక్షిణ చేసిన ధ్వజస్తంభం కు నమస్కరించి అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వాద మంటపంలో స్పీకర్ ను మంత్రి ఈశ్వర్, వేదపండితుల రమేష్, అర్చకులు స్వామివారి శేష వస్త్రాన్ని చిత్రపటాన్ని ఆయనకు బహూకరించి వేదమంత్రాలతో ఘనంగా ఆశీర్వదించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్థానిక శేషప్ప కళా వేదికపై ఆలయ పక్షాన కొనసాగుతున్న శ్రీ శుభ కృత నామ సంవత్సర పంచాంగ శ్రవణం ఆలకించారు.

వంశ పరంపర పంచాంగశ్రవణం ప్రవచనం చేస్తున్న బుగ్గారం ప్రసాద్ స్పీకర్ కు స్వామివారి ప్రసాదాన్ని అందించి ఆశీర్వదించారు.ఉదయం మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


అమ్మవారికి బంగారు కిరీటం బహూకరణ !!
స్థానికులు వాస్తవ్యుడు,హైదరాబాదులోని సన్ షైన్ కార్పొరేట్, ఆసుపత్రి ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి , లక్ష్మీ అమ్మవారి కి దాదాపు ఆరు లక్షలు విలువ గల విలువ గల బంగారు కిరీటాన్ని బహూకరించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ దంపతులు, వేదపండితులు డాక్టర్ శ్రీధర్ కస్తూరి నీ ఆశీర్వాద మంటపంలో స్వామివారి శేషవస్త్రం , చిత్రపటాన్ని అందించి ఘనంగా ఆశీర్వదించి సన్మానించారు.

స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ అభివృద్ధి కమిటీ సభ్యులు, రైతు సంఘ నాయకుడు ఏస్.భీమయ్య మున్నూరు కాపు పట్టణ సంఘ అధ్యక్షుడు సంగిశేఖర్, దేవాదాయ శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్ డి. రాజేశ్వర్, ఐసిఐసిఐ బ్యాంకు దక్షిణాది ప్రాంతీయ రీజినల్ మాజీ మేనేజర్ గుండి విష్ణు ప్రసాద్,1975 ఎస్ఎస్సి మిత్రబృందం. తదితరులు పాల్గొన్నారు.


నిష్ఠా గరిష్టు లకు సన్మానం !!
ఉగాది పర్వదినం పురస్కరించుకొని స్థానిక గాయత్రి నిత్యాన్న సత్రం భవనంలో అధ్యక్షుడు డాక్టర్ కోడెల దత్తాత్రి, సత్రం పాలకవర్గ సభ్యులు వివిధ రంగాల్లో నిష్ఠా గరిష్ట లైన. బ్రహ్మశ్రీ పంతుల శంకర్, రొట్టె గుండయ్య, తెలుగు కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంగనభట్ల నర్సయ్య లను ఘనంగా సన్మానించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో అన్న సత్రం నాయకులు మోహన్ రావు, మధ్వాచార్య రామ్ కిషన్, గొల్లపల్లి గుండయ్య ,సుభాష్ ,పాలెపు చంద్రమౌళి ,కాసర్ల వెంకటరమణ , డాక్టర్ రామకృష్ణ, సంగనభట్ల దినేష్ , ఇందారపు రామ్ కిషన్, శేఖర్ ,భూషణ్ తదితరులు పాల్గొన్నారు.


బిందె తీర్థం ఆరంభం !
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రతి నిత్యం గోదావరి నది నుండి పవిత్ర జలాలను అర్చక స్వాములు, మంగళ వాయిద్యాలతో తీసుకొని వచ్చి అభిషేకించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. గత కొంతకాలంగా అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ఆ సాంప్రదాయం తాత్కాలికంగా వాయిదా పడింది. తిరిగి ఉగాది పర్వదినం నుండి బిందె తీర్థ కార్యక్రమం ప్రారంభించినట్లు కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Advertisement .